For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vande Bharat Train: త్వరలో అందుబాటులోకి రానున్న 6వ వందే భారత్ ట్రైన్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

|

భారతీయ రైల్వే ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో 5 వందే భారత్ రైళ్లను నడుపుతోంది. వందే భారత్ రైళ్లను 100 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. ఇవి సెమీ హై-స్పీడ్ రైళ్లు. త్వరలో 6వ వందే భారత్ రైలు ట్రాక్‌పై పరుగులు తీయనుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడువనుంది. ఈ రైలును 2022 డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

5 గంటలు

5 గంటలు

ఇంతకుముందు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ కు వెళ్లడానికి 7 గంటలు సమయం పట్టేది. వందే భారత్ రైలుతో కేవలం ఐదున్నర గంటల్లో బిలాస్ పూర్ నుంచి నాగ్ పూర్ కు వెళ్లొచ్చు. ఈ రైలు బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 12.15 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నాగ్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్ చేరుకుంటుంది.

160 కిలోమీటర్ల వేగం

160 కిలోమీటర్ల వేగం

తూర్పు-మధ్య రైల్వే బిలాస్‌పూర్-నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలును నడుపుతుంది. ఈ రైలు రాయ్పూర్, దుర్గ్, గోండియా స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అవి ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి మాత కత్రా, గాంధీనగర్ నుంచి ముంబై, న్యూఢిల్లీ నుంచి అందౌరా స్టేషన్, చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

WiFi

WiFi

ఈ రైళ్లలో అన్ని కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. GPS సిస్టమ్, WiFi ఉన్నాయి. అదే సమయంలో, రైలులోని ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో, ప్రయాణికుల కోసం 360-డిగ్రీల తిరిగే కుర్చీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.

త్వరలో అందుబాటులోకి రానున్న 6వ వందే భారత్ ట్రైన్

డిసెంబర్ 11 నుంచి అందుబాటులోకి రానున్న ట్రైన్

ప్రారంభించనున్న ప్రధాన మంత్రి మోడీ

బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య నడవనున్న రైలు

టోమేటిక్ డోర్లతో పాటు GPS సిస్టమ్, WiFi సౌకర్యం

English summary

Vande Bharat Train: త్వరలో అందుబాటులోకి రానున్న 6వ వందే భారత్ ట్రైన్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే.. | Vande Bharat Train to start from Bilaspur in Chhattisgarh to Nagpur in Maharashtra from December 11

Soon the 6th Vande Bharat train will run on the track. This train will run from Bilaspur in Chhattisgarh to Nagpur in Maharashtra.
Story first published: Monday, December 5, 2022, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X