For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aswath Damodaran: అమెరికా బ్యాంకింగ్ ఉపద్రవంపై హెచ్చరించిన వ్యాల్యుయేషన్ గురు..!

|

Aswath Damodaran: ప్రఖ్యాత వ్యాల్యుయేషన్ గురు అశ్వత్ దామోదరన్ అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్టెర్న్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న దామోదరన్ అంతర్జాతీయ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?

Aswath Damodaran

అమెరికాలో వరుసగా మూడో బ్యాంక్ కుప్పకూలటం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే ఈ ఉపద్రవం ఇక్కడితో ముగియలేదని యూఎస్ బ్యాంకింగ్ వ్యాపారంలో మరిన్ని కంపెనీలు పతనం కాబోతున్నాయని అశ్వత్ శనివారం అన్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత అనేక ప్రాంతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల ఉపసంహరణ వేగం పెరిగింది. ఇదే సమయంలో ఆ బ్యాంకుల షేర్లు భారీగా పతన కావటం కొనసాగుతోంది.

Aswath Damodaran

చివరగా పతనమైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ను జేపీ మోర్గన్ స్వాధీనం చేసుకుంది. అయితే ప్రస్తుత సంక్షోభం 2008 మాదిరిగా కాకుండా.. బ్యాంకుల అంతటా సంపదను పునఃపంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. 2023లో బ్యాంకింగ్ సంక్షోభం స్లో-మోషన్ కార్ ధ్వంసంలా కనిపిస్తోందని అన్నారు. అయితే బ్యాంకింగ్ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని ప్రాథమిక వ్యాపార స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

మంచి సమయాల్లో ఇన్వెస్టర్లు, రెగ్యులేటర్లు చెడ్డ బ్యాంకులను పట్టికోరని దామోదరన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అధిక వడ్డీ రేట్లు, మాంద్యం వంటి పరిస్థితులు సదరు బ్యాంకులను వెలుగులోకి తెస్తాయని అన్నారు. డిపాజిట్లలో అత్యధిక వృద్ధిని సాధించిన బ్యాంకుల వద్ద మార్కెట్ క్యాప్ నష్టం ఎక్కువగా ఉందని స్పష్టమవుతోందని ఆయన వెల్లడించారు. తాజా సంక్షోభం వల్ల అకౌంటింగ్ నియమాలు, రెగ్యులేటరీ ఫ్లేమ్ వర్క్ మరింత కఠినతరంగా మారనుందని తెలిపారు.

English summary

Aswath Damodaran: అమెరికా బ్యాంకింగ్ ఉపద్రవంపై హెచ్చరించిన వ్యాల్యుయేషన్ గురు..! | Valuation guru Aswath Damodaran warns more dominos ready to fall amid US Banking crisis

Valuation guru Aswath Damodaran warns more dominos ready to fall amid US Banking crisis..
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X