గురుగ్రామ్‌కు చెందిన యూజ్డ్ కార్ల వెబ్ సైట్ CARS24 కొత్తగా యూనీకార్న్ క్లబ్‌లోకి ఎంటర్ అయింది. తాజా సిరీస్ ఈ-రౌండ్లో 200 మిలియన్ డాలర్లను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 బిలియన్ డాలర్లు దాటింది. యురీ మిల్లర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ డీఎస్టీ గ్లోబల్ నుండి భారీ మొత్తాన్ని సమీకరించింది. దీంతో యూనికార్న్ క్లబ్లో తాజాగా చేరింది.
ఈ సంస్థ సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తుంది. కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశీయంగా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది. ప్రజలు పబ్లిక్ ట్రాన్సుపోర్ట్కు బదులు ప్రత్యామ్నాయ మార్గంగా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కార్స్24కు డిమాండ్ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల్లో దాదాపు 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

వైరస్ నేపథ్యంలో భద్రతా కారణాలతో కార్లు లేని వారు సొంత కారు కోసం చూస్తున్నారని, ఎక్కువ ఖర్చు చేయలేనివారు సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. బైకులు ఉన్నవారు కూడా ఫ్యామిలీతో వెళ్లడం కోసం కార్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications