For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోలో ఇంటెల్ భారీ పెట్టుబడి, నాటి నుండి 40% ఎగిసిన రిలయన్స్ షేర్లు

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సెమీ కండక్టర్ దిగ్గజం ఇంటెల్ జియోలో రూ.1,894.5 కోట్ల పెట్టుబడితో 0.39 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీకి ఇంటెల్ ఫేమస్. ప్రపంచ దిగ్గజ సంస్థలు జియోలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో 25.04 శాతం వాటాలను రిలయన్స్ విక్రయించినట్లయింది. ఏప్రిల్ నుండి వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి.

రిలయన్స్ - జియో ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడుల న్యూస్

రూ.1,17,588.45 కోట్ల పెట్టుబడులు

రూ.1,17,588.45 కోట్ల పెట్టుబడులు

జియో ప్లాట్‌ఫాంలో తాజాగా ఇంటెల్ పెట్టుబడులతో వాటా విక్రయాల ద్వారా రూ.1,17,588.45 కోట్లు సమీకరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఏప్రిల్ 22వ తేదీన ఫేస్‌బుక్‌తో ప్రారంభమైన పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. 11 వారాల్లో ఇన్వెస్ట్ చేసిన పన్నెండో భారీ పెట్టుబడి ఇది. టెక్నాలజీ రంగం ఇంటెల్ అగ్రగామి. ఇది ఎన్నో ఆవిష్కరణలు చేసింది.

విలువైన భాగస్వామి

విలువైన భాగస్వామి

ఇంటెల్ ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థ అని, విలువైన భాగస్వామిగా అత్యుత్తమ రికార్డ్ కలిగి ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థను అన్ని రంగాల్లో మరింత శక్తిమంతం చేసే దిశగా, 1.3 బిలియన్ల భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఇంటెల్‌తో కలిసి పని చేస్తామన్నారు. జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్ మొదలు సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, అబూదాబికి చెందిన ముబాదాల, అబూదాబి ఇన్వెస్ట్‌మెంట్స్ అథారిటీ, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ పెట్టుబడులు పెట్టాయి.

రిలయన్స్ షేర్లు జూమ్

రిలయన్స్ షేర్లు జూమ్

కరోనా దెబ్బకు తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో రెండు మూడు నెలల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ భారీగా పడిపోయింది. ఓ సమయంలో వెయ్యి కంటే దిగువకు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ పెట్టుబడుల దర్వాత వరుసగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుండటంతో రిలయన్స్ షేర్ ఈ రెండున్నర నెలల కాలంలో ఏకంగా 40 శాతం ఎగిసింది. వరుస పెట్టుబడులతో రిలయన్స్ రుణరహిత సంస్థగా కూడా నిలిచింది. ఈ రోజు మధ్యాహ్నం రూ.1,778 వద్ద ఉంది.

12 వరుస పెట్టుబడులు

12 వరుస పెట్టుబడులు

- ఏప్రిల్ 22 - ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా

- మే 3 - సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా

- మే 8 - విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- మే 17 - జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా

- మే 22 - కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- జూన్ 5 - ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా

- జూన్ 5 - సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

- జూన్ 7 - ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా

- జూన్ 13 - TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

- జన్ 13 - ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

- జూన్ 18 - PIF - రూ.11,367 కోట్లు - 2.32 శాతం వాటా

- జూలై 3 - ఇంటెల్ - రూ.1,894.5 కోట్లు - 0.39 శాతం వాటా

English summary

జియోలో ఇంటెల్ భారీ పెట్టుబడి, నాటి నుండి 40% ఎగిసిన రిలయన్స్ షేర్లు | US semiconductor giant Intel to invest Rs 1,895 crore in Jio Platforms

Reliance Industries and Jio Platforms on Friday announced that Intel Capital will invest Rs. 1,894.50 crores in Jio Platforms at an equity value of Rs. 4.91 lakh crores and an enterprise value of Rs. 5.16 lakh crores.
Story first published: Friday, July 3, 2020, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X