For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో Walmart రికార్డులు.. చైనాను వెనక్కినెట్టిన యూఎస్ దిగ్గజం..

|

Walmart: అమెరికాకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సంస్థ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ను కొనుగోలు చేయటంతో భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.

అమెరికా బయట వాల్‌మార్ట్ అతిపెద్ద మార్కెట్ గా చైనా ఉంది. అయితే ప్రస్తుతం దీనిని అధిగమించటానికి భారత్ సిద్ధంగా ఉందని వాల్‌మార్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ డేవిడ్ రైనీ వెల్లడించారు. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే "ఉత్తేజకరమైన అవకాశాలు" దేశంలో పెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయని వెల్లడించారు.

US retailer Walmart getting record sales in India surpassing China know details

ఈ ఏడాది చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని తాను నమ్మకంతో ఉన్నానని రైనీ వెల్లడించారు. ఇది భవిష్యత్తులో నిజంగా మంచి అవకాశమని ఆయన తెలిపారు. రానున్న కాలంలో కంపెనీకి ఆదాయ వృద్ధి చాలా వరకు ఫ్లిప్‌కార్ట్ నుంచి వస్తుందని అన్నారు. ఫిబ్రవరిలో పోస్ట్-ఎర్నింగ్ కాల్‌లో ఎగ్జిక్యూటివ్ పేర్కొన్న తర్వాత రైనీ చేశారు.

చైనా గతంలో వాల్‌మార్ట్ కు అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా ఉంది. కంపెనీ ఇక్కడ 365 రిటైల్ యూనిట్లను కలిగి ఉంది. అయితే BCG-RAI నివేదిక ప్రకారం.. భారతదేశ రిటైల్ పరిశ్రమ ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని వెల్లడైంది. ఇది 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వారు అంచనాలు చెబుతున్నాయి.

కంపెనీ కేవలం భౌతిక స్టోర్లలో మాత్రమే కాక ఆన్‌లైన్ స్టోర్‌లలో పురోగతి కనిపిస్తోంది. అయితే వాల్‌మార్ట్‌ నాల్గవ త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం 72 శాతం మేర తగ్గి 300 మిలియన్ డాలర్లకు పడిపోయింది. వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేలను సెపరేట్ చేయటమే దీనికి ప్రాథమిక కారణంగా కంపెనీ పేర్కొంది.

English summary

ఇండియాలో Walmart రికార్డులు.. చైనాను వెనక్కినెట్టిన యూఎస్ దిగ్గజం.. | US retailer Walmart getting record sales in India surpassing China know details

US retailer Walmart getting record sales in India surpassing China know details
Story first published: Thursday, March 9, 2023, 20:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X