For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Crisis: ముదురుతున్న అమెరికా డిఫాల్ట్ సంక్షోభం.. రేటింగ్ తగ్గించిన ఫిచ్..

|

US Crisis: అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరోపక్క డెట్ సీలింగ్ గురించి గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్.. రుణ గడువు ముగుస్తున్నందున US రేటింగ్‌ను ప్రతికూల పరిశీలనలో ఉంచింది.

ఈ క్రమంలో క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరిందని, రుణ సంక్షోభానికి త్వరలోనే తెరపడుతుందని ఫిచ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ ఫిచ్ రేటింగ్‌ను తగ్గించినట్లయితే.. అది ట్రెజరీ డెట్ సెక్యూరిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తోంది.

US Crisis:

అమెరికాలో ప్రభుత్వం రుణ పరిమితిని పెంచాలనుకుంటోంది. ఇది ప్రతి సంవత్సరం అక్కడ సభ ద్వారా నిర్ణయించబడుతుంది. యూఎస్ ప్రభుత్వ పాలసీలు, జీతాలు మొదలైనవాటికి సభ అనుమతితో రుణాలు తీసుకోవడం ద్వారా డబ్బు ఖర్చు చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డెమొక్రాటిక్ పార్టీకి చెందినవాడు, హౌస్‌లో రిపబ్లికన్ ప్రతిపక్ష సభ్యుడు కూడా అయినందున రుణ పరిమితిని పెంచడంలో ప్రతిష్టంభన పెరిగింది. ఖర్చు తగ్గించుకోవడానికి బిడెన్ ప్రభుత్వం కొన్ని షరతులు పాటిస్తేనే రుణ పరిమితి ఆమోదం పొందుతుందని రిపబ్లికన్లు చెబుతున్నారు.

US Crisis:

రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్టర్‌గా మారే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డిఫాల్ట్ అయిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రభావితమవుతాయి. ఈ డిఫాల్ట్ చాలా కాలం పాటు కొనసాగితే.. దాదాపు 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. అదే సమయంలో స్టాక్ మార్కెట్ పతనమై ఇన్వెస్టర్లు 10 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపోవచ్చని తెలుస్తోంది.

అమెరికాలో అధ్వాన్నమైన పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది. జర్మనీ స్థూల దేశీయోత్పత్తి అంటే GDP 0.3% పడిపోయింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ అనేక వరుస త్రైమాసికాల్లో సంకోచంలో ఉంది. మాంద్యం సాధారణంగా రెండు వరుస త్రైమాసిక సంకోచంగా నిర్వచించబడుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది.

English summary

US Crisis: ముదురుతున్న అమెరికా డిఫాల్ట్ సంక్షోభం.. రేటింగ్ తగ్గించిన ఫిచ్.. | US rating agency Fitch puts US credit rating on negative watch, know details

US rating agency Fitch puts US credit rating on negative watch, know details
Story first published: Thursday, May 25, 2023, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X