For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

H-1B Visa: H1B వీసాలపై జో బిడెన్ కీలక నిర్ణయం.. భారం అంటున్న టెక్కీలు.. ఏంటి సార్ ఇది అంటూ..?

|

H-1B Visa: ఉపాధి కోసం అమెరికా వెళ్లే వారందరికీ తెలుసు H-1B వీసా విలువేంటో. దీనికోసం పడిగాపులు కాసే వారు కొందరైతే.. చిలుకూరు బాలాజీకి మెుక్కుకునే వారు మరికొందరు. అమెరికాలో నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకునే వారికి జో బిడెన్ ప్రభుత్వం వీటి విషయంలో అకస్మాత్తుగా ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇది కేవలం సాఫ్ట్ వేర్ హౌత్సాహికులను మాత్రమే కాక దేశీయ టెక్ కంపెనీలకు కూడా పెద్ద భారంగా మారుతుందని చెప్పుకోవాలి.

 వీసా ప్రాసెసింగ్ ఫీజు..

వీసా ప్రాసెసింగ్ ఫీజు..

చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ను పర్యవేక్షించే ఏజెన్సీకి నిధులు సమకూర్చేందుకు ఉద్యోగ ఆధారిత వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను పెంచాలని అధ్యక్షుడు బిడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో H-1B వీసా కోసం ప్రాథమిక రుసుము 470 డాలర్లుగా ఉండేది. అయితే దీనిని మూడింతలు పెంచి 1,595 డాలర్లు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీసా కలిగిన వ్యక్తులు అమెరికాలో 6 ఏళ్ల పాటు నివసించటానికి అనుమతిని ఇస్తుంది.

 వివిధ వీసాల రుసుములు పెంపు..

వివిధ వీసాల రుసుములు పెంపు..

కేవలం H-1B వీసాల విషయంలో మాత్రమే కాకుండా ఇతర రకాలపై కూడా రుసుములను అమెరికా ప్రభుత్వం భారీగానే పెంచేసింది. ఈ క్రమంలో L-1 వీసాల రుసుమును 460 డాలర్ల నుంచి 1,958 డాలర్లకు పెరుగుతుంది. US ఆధారిత ప్రాజెక్ట్‌లో కనీసం 9,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే విదేశీ పెట్టుబడిదారులు US శాశ్వత నివాసితులు కావడానికి అనుమతించే EB-5 వీసా కోసం దరఖాస్తు ఖర్చు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరుగుతోంది.

 ప్రతి రెండేళ్లకూ..

ప్రతి రెండేళ్లకూ..

యూఎస్ ఇమ్మగ్రేషన్ ఏజెన్సీ ప్రతి రెండేళ్లకు ఒకసారి తన రుసుము నిర్మాణాన్ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ 2016 నుంచి అలా చేయడం లేదు. 2019లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ఫీజుల సెట్‌ను అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసింది. 2020లో ప్రెసిడెంట్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు తగ్గడం కొవిడ్ -19 మహమ్మారితో సమానంగా ఉన్నందున ఏజెన్సీకి నిధుల సంక్షోభం ఏర్పడింది.

Read more about: h 1b visa visa joe biden us visa
English summary

H-1B Visa: H1B వీసాలపై జో బిడెన్ కీలక నిర్ణయం.. భారం అంటున్న టెక్కీలు.. ఏంటి సార్ ఇది అంటూ..? | US Joe Biden Government rising H-1B Visa processing fee, other catagery visas too

US Joe Biden Government rising H-1B Visa processing fee, other catagery visas too
Story first published: Thursday, January 5, 2023, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X