For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: రివర్స్ గేర్ లో యూఎస్ ఐటీ దిగ్గజం.. ఇండియాలో అలా చేయటంపై టెక్కీల కన్నీళ్లు ..!

|

IT News: ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగులకు యాజమాన్యాలకు మధ్య ఇది గ్యాప్ పెంచుతోంది. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ కంపెనీ సైతం జతకట్టింది. కరోనా తర్వాత పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించిన కంపెనీలకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి.

 ఆఫర్ లెటర్ల మాయ..

ఆఫర్ లెటర్ల మాయ..

ఆర్థిక ప్రభావం ఉన్నప్పటికీ భారత్ లోని ఐటీ రంగం మాత్రం గత 3 ఏళ్లుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన యుద్ధం ఐటీ రంగాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తోంది.ఇవిగో ఉద్యోగాలు అంటూ చేతిలో ఆఫర్ లెటర్లు పెట్టిన కంపెనీలు ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసేస్తున్నాయి. అసలు ఎంపిక చేసుకున్న తర్వాత వారిని ఎందుకు పిలవటం లేదు..? భారతీయ ఐటీ కంపెనీలకు ఏమైంది..?

 అమెరికా టెక్ దిగ్గజం..

అమెరికా టెక్ దిగ్గజం..

కొత్త ప్రాజెక్ట్‌లకు గ్లోబల్ మందగమనం, ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌లలో తగినంత నగదు ప్రవాహ మార్జిన్‌ల కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. దీని వల్ల విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు ఎంపిక చేసుకున్న ఉద్యోగులను సైతం తిరస్కరిస్తున్నాయి. అమెరికాకు చెందిన యాక్సెంచర్ సైతం క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా అక్టోబర్ 2021లో ఎంపిక చేసుకుంది. వివిధ కారణాల చేత వారికి అందించిన ఆఫర్ లెటర్లను కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి.

2023కు వాయిదా..

2023కు వాయిదా..

చాలా నెలల తర్వాత ఆన్‌బోర్డింగ్ లేకుండానే సెప్టెంబర్ 30 ఇచ్చిన లేఖలో వారి నియామకాన్ని 2023కి వాయిదా వేసింది. ఈ విషయంపై యాక్సెంచర్ కానీ, కళాశాలల యాజమాన్యాలు కానీ బాధ్యత స్వీకరించటానికి నిరాకరిస్తున్నారని బాధిత గ్రాడ్యుయేట్లు చెబుతున్నారు. ఇక విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్‌ కంపెనీల్లో చేరేందుకు తమ పాత కంపెనీని వదిలి వెళ్లిన చాలా మందికి ఇప్పుడు ఉద్యోగం లేకుండా పోవడం బాధాకరం.

 Google, Meta, Microsoft

Google, Meta, Microsoft

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గడ్డు పరిస్థితుల కారణంగా కేవలం భారతీయ ఐటీ కంపెనీలకే కాక.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేశాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న ఉద్యోగులను రీఆర్గనైజ్ చేసి తొలగిస్తున్నాయి.

Read more about: accenture it news jobs business news
English summary

IT News: రివర్స్ గేర్ లో యూఎస్ ఐటీ దిగ్గజం.. ఇండియాలో అలా చేయటంపై టెక్కీల కన్నీళ్లు ..! | us it jaint accenture delaying onboarding of recruited employees to 2023

us it jaint accenture delaying onboarding of recruited employees to 2023
Story first published: Thursday, October 6, 2022, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X