For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసిన ఐటీ కంపెనీ.. భారతీయ టెక్కీలే టార్గెట్.. ఎందుకిలా..?

|

IT News: ప్రపంచ మాంద్యం మధ్య, ఐటీ రంగం పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఐటీ రంగం గత కొన్ని నెలలుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం భారతీయ ఐటీ పరిశ్రమలో ఇది పెద్ద కల్లోలం సృష్టిస్తోంది.

జీతాల విషయంలో..

జీతాల విషయంలో..

ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాన్ని నిలిపివేస్తున్నాయి. ఇదే సమయంలో కంపెనీలు జీతాల పెంపును తాత్కాలికంగా తగ్గిస్తున్నాయి. అవసరమైతే ఉద్యోగుల సంఖ్యను తొలగించడం తప్ప మరో మార్గం లేదని వివిధ టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఐటీ సిబ్బంది భయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇంటర్వ్యూలో ఎంపిక..

ఇంటర్వ్యూలో ఎంపిక..

కరోనా కాలంలో ఐటీ రంగంలోని అనేక ప్రాజెక్టుల కోసం కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్లు జరుపుతున్నాయి. ఈ ట్రెండ్ మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున, చాలా మంది ఫ్రెషర్లు, అనుభవజ్ఞులను నియమించుకోవాలని కంపెనీలు భావించాయి. అందుకోసం వేల మందిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశాయి. అయితే వారిని ఏ ప్రాజెక్ట్‌లలో ఉపయోగించలేదు. సిబ్బంది కొరత అడ్డురాకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి.

 అమెరికా కంపెనీ ప్లాన్..

అమెరికా కంపెనీ ప్లాన్..

అమెరికాలోని న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ అయిన IT సేవల సంస్థ EPAM సిస్టమ్స్ దాదాపు 100 మంది భారతీయ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరింది. వీరిలో ఎక్కువ మంది బెంచ్‌మార్క్ ఉద్యోగులని, వారిని ఇంకా ఏ ప్లాన్‌లోనూ ఫిక్స్‌ చేయలేదని చెబుతున్నారు. అలాగే మరికొద్ది నెలల్లో పనిలో చేరబోతున్న వారి లేఖలు కూడా తిరిగొచ్చాయని చెబుతున్నారు.

తప్పుడు అంచనాలతో..

తప్పుడు అంచనాలతో..

అయితే కంపెనీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అనేక కంపెనీలు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఎక్కువమందిని నియమించుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయనే నెపంతో వారిని రాజీనామా చేయాలని తేల్చి చెబుతున్నాయి. ఇటీవల భారత ఐటీ కంపెనీలు సైతం అనేక మంది ఫ్రెషర్లను ఎంపిక చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్లను క్యాన్సిల్ చేయటం షాక్ కి గురిచేసింది.

మైక్రోసాఫ్ట్ నిర్ణయం ఏమిటి?

మైక్రోసాఫ్ట్ నిర్ణయం ఏమిటి?

మూడు నెలల జీతం అందుకున్న వెంటనే వెళ్లిపోవచ్చని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో కొందరికి చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వారికి రెండు నెలల నోటీసు ఇవ్వవచ్చు. ఈ మధ్యంతర కాలంలో ఏవైనా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే వారికి ఇచ్చిన రాజీనామా నోటీసును రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐటీ కంపెనీలు0 ఈ ట్రెండ్‌ని చాలా కంపెనీలు ఫాలో అవుతాయన్న భయం నెలకొంది.

Read more about: jobs it jobs business news
English summary

IT News: రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసిన ఐటీ కంపెనీ.. భారతీయ టెక్కీలే టార్గెట్.. ఎందుకిలా..? | us it company epam systems asked 100 indian employees for resignation by revoking offer

us it company epam systems asked 100 indian employees for resignation by revoking offer
Story first published: Tuesday, October 4, 2022, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X