భారత్‌తో పాటు ఇటలీ, టర్కీ, బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాలపై ప్రతీకార వర్తక చర్యలకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ-కామర్స్ సేవలపై ఈ దేశాలు పన్ను విధించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇందుకుబదులుగా ప్రతీకార వర్తక చర్యలను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR) ప్రతిపాదించారు. ఇండియా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ పైన యూఎస్ ట్రేడ్ యాక్ట్‌లోని 301 సెక్షన్ కింద గత ఏడాది జూన్ నెలలో అమెరికా విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం అమెరికా డిజిటల్ సేవల కంపెనీలపై పక్షపాతం చూపించేందిగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు.
ఈ వాదనను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. అయినా ప్రతికార చర్యలకే అమెరికా సిద్ధమవుతోంది. విచారణలో తేలిన అంశాల ఆధారంగా 301 సెక్షన్ కింద అమెరికా USTR ప్రతీకార చర్యలను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం మన దేశం నుండి అమెరికాకు ఎగుమతయ్యే చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, వెదురు, వజ్రాలు-రత్నాలు, ఫర్నీచర్, సిగరేట్ పేపర్ వంటి ఉత్పత్తులపై అదనంగా యాడ్ వెలారమ్ పన్నులు విధించే అవకాశముంది.

అమెరికా కంపెనీల నుండి మన దేశం ఎంతమేరకు డిజిటల్ సర్వీసెస్ టాక్స్ వసూలు చేస్తుందో దాదాపు అంతే మొత్తాన్ని మనదేశం నుండి వచ్చే వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేయాలని అమెరికా భావిస్తోందట. అంచనాల ప్రకారం మనదేశంలో అమెరికా కంపెనీల నుండి వసూలు చేసే DST ప్రతి సంవత్సరం 5.5 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని అంచనా.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications