For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, అమెరికాలో పెరుగుతున్న ఉద్యోగాలు: ఏ సిటీలో ఎంత నిరుద్యోగ శాతం?

|

కరోనా కారణంగా గతంలో అమెరికాలో భారీగా పెరిగిన నిరుద్యోగితరేటు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో నేల క్షీణించింది. జూలై నెలలో నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా నిలిచింది. వివిధ రంగాల్లోని కంపెనీలు ఈ కాలంలో 1.8 మిలియన్ల ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఉద్యోగాలు పెరిగి, నిరుద్యోగిత రేటు తగ్గింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద శుభవార్త. చైనా అంతకుముందు క్వార్టర్‌లో మంచి వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు అమెరికాలో నిరుద్యోగం తగ్గుతోంది. ఇది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు కూడా ఊరట కలిగించే అంశమే.

అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!

ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు పెరిగాయి

ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు పెరిగాయి

జూలై నెలలో లీజర్ అండ్ హాస్పిటాలిటీలో దాదాపు ఆరు లక్షల మంది, ప్రభుత్వంలో మూడు లక్షలమందికి పైగా, రిటైల్ ట్రేడ్ రెండున్నర లక్షలకు పైగా, హెల్త్ కేర్ అండ్ సోషల్ అసిస్టెన్స్ దాదాపు రెండు లక్షలు, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సర్వీసెస్ లక్షాడెబ్బైవేలు ఉద్యోగాలు వచ్చాయి. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ వేర్ హోసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్, యుటిలిటీస్‍‌లలో ఇలా అన్నింట కలిపి 1.8 మిలియన్ల ఉద్యోగాలు జత కలిశాయి. జూలై నాటికి 10.2 శాతం నిరుద్యోగిత రేటుతో, 16.3 మిలియన్ ప్రజలు నిరుద్యోగులుగా దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఇది 6.7 శాతం, 10.6 మిలియన్ల ప్రజలు ఉన్నారు.

నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతి

కరోనా నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగ భృతి కింద ఏప్రిల్ నుండి వారానికి 600 డాలర్లు అందించింది. అమెరికాలోని నిరుద్యోగుల్లో 56 శాతం మంది (9.2 మిలియన్లు) ఆయా కంపెనీల్లోనే ఉన్నారు. కానీ వేతనం లేని సెలవుల్లో ఉన్నారు. ఇది ఏప్రిల్ నెలలో 78 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత రేటు గత కొన్ని నెలలుగా తగ్గినప్పటికీ అమెరికాలో మాత్రం ఇది ఇప్పటికీ ప్రీ-కోవిడ్ కంటే చాలా ఎక్కువే. అమెరికాలో చాలామంది ఉద్యోగ భయంతో ఉన్నారు.

జూన్‌లో ఏ నగరాల్లో ఎంత నిరుద్యోగిత రేటు

జూన్‌లో ఏ నగరాల్లో ఎంత నిరుద్యోగిత రేటు

అమెరికాలో పలు నగరాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది. జూన్ నెలలో ప్రెన్స్కో నగరంలో 15.1 శాతం, చికాగో-నాపెర్విల్లె-ఎల్గిన్, మోడెస్టో, స్క్రాటన్, విల్కీస్ బారె, హాజ్లెటన్, యూబా సిటీ నగరాల్లో 15.2 శాతం, వోర్సెస్టర్‌లో 15.5 శాతం, మెర్సెడ్, స్టాక్‌టన్, లోడి నగరాల్లో 15.9 శాతం, మిచిగాన్ సిటీ 16.1 శాతం, ఆర్నాల్డో, కిస్సిమ్మీ, శాన్‌ఫోర్డ్‌లో 16.4 శాతం, సలినాస్ 16.5 శాతం, ఫ్లింట్ నగరంలో 16.6 శాతం, రాక్‌ఫోర్డ్, బోస్టన్, కేంబ్రిడ్జ్, న్యూటన్, స్ప్రింగ్ ఫీల్డ్ లో 16.7 శాతం, న్యూయార్క్, జెర్సీ సిటీ, కోకోమోలో 17.1 శాతం, బేకర్స్‌ఫీల్డ్‌లో 17.4 శాతం, విన్‌లాండ్, బ్రిడ్జ్‌టన్ 17.5 శాతం, లాస్ ఏంజిల్స్ 17.6 శాతం, డెట్రాయి, వారెన్ సిటీ, డియర్‌బోర్న్ నగరాల్లో 17.7 శాతం, విసాలియా, పోర్టెర్విల్లె, మస్క్‌గోన్‌లో 17.8 శాతం, పిట్స్‌ఫీల్డ్, లాస్ వెగాస్, హెండర్సన్, పారడైజ్, 17.9 శాతం, ఈస్ట్ స్ట్రౌడ్స్‌బర్గ్‌లో 18 శాతం, యుమాలో 18.1 శాతం, బార్న్‌స్టేబుల్ టౌన్‌లో 19.7 శాతం, కుహులుయ్, వైలుకు, లాహైనా నగరాల్లో 22.3 శాతం, ఓసియన్ సిటీలో 26.7 శాతం, ఎల్ సెంట్రోలో 28.7 శాతం, అట్లాంటింక్ సిటీ, హమ్మంటన్ నగరాల్లో 35 శాతంగా ఉంది.

English summary

గుడ్‌న్యూస్, అమెరికాలో పెరుగుతున్న ఉద్యోగాలు: ఏ సిటీలో ఎంత నిరుద్యోగ శాతం? | US Added 1.8 Million Jobs in July, unemployment rate fell to 10.2 percent

The unemployment rate fell for the third straight month, to 10.2% in July. That exceeded expectations, as employers added about 1.8 million jobs to their payrolls.
Story first published: Monday, August 10, 2020, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X