For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?

|

DA Hike: దేశంలో ఉన్న ద్రవ్యోల్భణం పరిస్థితుల్లో డీఏ పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే కేంద్రం దీనిపై ఒక శుభవార్త ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ప్రజలకు ధరల భారం నుంచి స్వల్ప ఊరట లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

డియర్‌నెస్ అలవెన్స్..

డియర్‌నెస్ అలవెన్స్..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని తన కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంచాలని యోచిస్తోంది. అయితే దీనికోసం ముందుగా రూపొందించిన ఫార్ములా ప్రకారం ఎంత పెంచాలనే నిర్ణయం తీసుకోనుంది.

ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్‌నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా జరుగుతుంది. డిసెంబర్ 2022కి CPI-IW జనవరి 31, 2023న విడుదలైంది.

ఈ సారి పెంపు ఇలా..

ఈ సారి పెంపు ఇలా..

అంతర్గత సమాచారం మేరకు ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెంచవచ్చని తెలుస్తోంది. అంటే దాదాపు 4 శాతం మేర డీఏ పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏను పెంచే ప్రతిపాదనను రూపొందిస్తుంది. దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. అయితే ఆమోదం పొందిన తర్వాత పెరిగిన డీఏ జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.

చివరిగా డీఏ సవరణ..

చివరిగా డీఏ సవరణ..

దీనికి ముందు చివరగా డీఏను సెప్టెబర్ 28, 2022లో సవరించటం జరిగింది. అప్పుడు సవరించిన రేటు జూలై 1, 2022 నుంచి అమలులో ఉంది. అప్పట్లో ఇండియా వినియోగదారుల ధరల సూచీలో 12 నెలవారీ సగటు పెరుగుదల ఆధారంగా రేటును 4 శాతం పెంచి 38 శాతానికి చేర్చింది కేంద్రం. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం డీఏను అందజేస్తుంది. డీఏను ఏడాదికి క్రమం తప్పకుండా కేంద్రం రెండుసార్లు సవరిస్తుంది.

English summary

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..? | Union government Likely to Hike Dearness Allowance by 4 percent this time knoe details

Union government Likely to Hike Dearness Allowance by 4 percent this time know details..
Story first published: Sunday, February 5, 2023, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X