For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2023: బడ్జెట్ ఫోకస్ సప్తర్షులపైనే.. ఏడు అడుగులతో ముందుకు భారతావని..

|

Union Budget 2023: భారత్ ఇప్పుడు అమృతకాలంలో ఉందన్న నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ ఏడు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ప్రధానంగా దేశంలో గ్రీన్ గ్రోత్, యువశక్తి, సమగ్రాభివృద్ధి, చిట్ట చివరి వ్యక్తి వరకు సేవలను చేర్చటం, ఇన్ ఫ్రాస్టరక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్, వృద్ధికి అవకాశాలను అందిపుచ్చుకోవటం, డిజిటల్ ఫ్లాట్ ఫారమ్లను లాంచ్ చేయటం ద్వారా దేశ ఆర్థికాన్ని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు.

 చిట్ట చివరి వరకు సేవలు..

చిట్ట చివరి వరకు సేవలు..

ఉత్తర ఈశాన్య ప్రాంతాలను చేరుకునేందుకు వాచ్ పేయి ప్రభుత్వ కాలంలో చర్యలు చేపట్టినట్లు నిర్మలమ్మ వెల్లడించారు. వీరికోసం తమ ప్రభుత్వం ఆయుష్, ఫిషరీస్,జల్ శక్తి వంటి మినిస్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైబల్ ప్రాంతాల కోసం PM PVTG డెవలప్ మెంట్ మిషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. దీనిద్వారా నీరు, న్యూట్రిషన్, కూడు, గూడు, సౌకర్యాల కోసం, ఆరోగ్యం, విద్య వంటి అనేక వాటి కోసం రూ.15,000 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. రానున్న 3 ఏళ్లలో వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు.

 పెరిగిన క్యాపెక్స్ పెట్టుబడులు..

పెరిగిన క్యాపెక్స్ పెట్టుబడులు..

ఏకలవ్యా మోడల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలోని పురాతన స్కిప్చర్లను డిజిటలైజేషన్ చేయనున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు. బెయిల్ పొందేందుకు కూడా డబ్బు లేని పేద ఖైదీలకు ప్రభుత్వం నుంచి సాయం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా తర్వాత ప్రైవేట్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. క్యాపెక్స్ పెట్టుబడులను 33 శాతం మేర పెంచి రూ.10 లక్షల కోట్లుగా చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019-20 కంటే మూడింతలు పెరిగిన క్యాపెక్స్ పెట్టుబడులు.

వడ్డీ లేని రుణం..

వడ్డీ లేని రుణం..

రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం సాయం అందించాలని నిర్ణయించినట్లు నిర్మలమ్మ వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రాయితీతో కూడిన రుణాలను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు. ఇందుకోసం రూ.13.7 లక్షల కోట్లను కేటాయించారు. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు.

English summary

Union Budget 2023: బడ్జెట్ ఫోకస్ సప్తర్షులపైనే.. ఏడు అడుగులతో ముందుకు భారతావని.. | Union FM revealed saptarshi key 7 points drive budget 2023 in amrith kal

Union FM revealed saptarshi key 7 points drive budget 2023 in amrith kal
Story first published: Wednesday, February 1, 2023, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X