For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax: పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం.. దశలవారీగా కొద్ద పద్ధతికి శ్రీకారం..!

|

Income Tax: కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ సాధారణ మధ్యతరగతి సామాన్యులు ఆశించేది పన్ను మినహాయింపులే. టాక్స్ శ్లాబ్ రేట్లలో ఏవైనా మార్పులు వచ్చాయా, వేటిపై పన్నులు తగ్గుతున్నాయి వంటి అంశాలను గమనిస్తుంటారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించటం అనే కొత్త అంశాన్ని పరిశీలిస్తోంది.

 ఆదాయపు పన్ను తగ్గింపు..

ఆదాయపు పన్ను తగ్గింపు..

పన్ను రేట్లను తగ్గించడం వంటి కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని తీయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అనేక తగ్గింపులు, పన్ను రాయితీ ప్రయోజనాలను అందించే పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని దశలవారీగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2020-21లో ప్రవేశపెట్టిన తక్కువ పన్ను రేట్లతో మినహాయింపు రహిత వ్యవస్థను ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

 ప్రస్తుతం రెండు ఆప్షన్లు..

ప్రస్తుతం రెండు ఆప్షన్లు..

ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ దేశంలోని పన్ను చెల్లింపుదారులకు.. రెండు టాక్స్ విధానాలను అందుబాటులో ఉంచింది. అయితే ఏ విధానాన్ని పాటించాలి అనేదానిని ఎంపిక చేసుకునే నిర్ణయం టాక్స్ పేయర్లకు వదిలేసింది. వారి అవసరాలకు అనుగుణంగా పాత లేదా కొత్త విధానాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఏ విధానం ద్వారా టాక్స్ తక్కువ చెల్లించాల్సి వస్తుందో లెక్కించుకున్న తరువాత చాలా మంది నిర్ణయం తీసుకుంటున్నారు.

 సులువైన టాక్స్ విధానం కోసం..

సులువైన టాక్స్ విధానం కోసం..

టాక్స్ రాయితీలు, మినహాయింపుల కోసం అభ్యర్థనలను తగ్గించటం ద్వారా విధానం సరళీకృతం చేసేందుకు ఈ చర్యలు తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తెచ్చే దానిలో స్లాబ్‌లను రూపొందించి పన్ను రేట్లను తగ్గించేపనిలో ఉన్న మార్గాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు పరిశీలిస్తోంది.

టాక్స్ ఆదాయం పెంచేదుకు..

టాక్స్ ఆదాయం పెంచేదుకు..

పన్నుల చెల్లింపుల్లో పారదర్శకతను తెచ్చే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు దేశంలోని ఎక్కువ మందిని టాక్స్ పరిధిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నమని చాలా మంది భావిస్తున్నారు. మినహాయింపులను వదులుకునే కార్పొరేట్ కంపెనీలకు పన్ను రేట్లను తగ్గించే విధంగానే.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్ధతి అందుబాటులోకి వస్తోంది.

 నిపుణుల సహాయం లేకుండా..

నిపుణుల సహాయం లేకుండా..

కొత్త టాక్స్ విధానం.. టాక్స్ నిపుణుల సహాయం లేకుండా ITR ఫైల్ చేసే తక్కువ ఆదాయ బ్రాకెట్లలో ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. కొత్తగా ఆదాయం సంపాదిస్తున్న యువతకు ఇది ఎక్కువగా సహాయకారిగా ఉండవచ్చు. ఎందుకంటే మినహాయింపులు పొందేదుకు పెట్టుబడులు పెట్టాలి కాబట్టి ఆ అవసరం లేని వారికి తక్కువ పన్ను శ్లాబ్స్ ఉపయోగపడతాయి.

English summary

Income Tax: పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం.. దశలవారీగా కొద్ద పద్ధతికి శ్రీకారం..! | union finance ministry planning to cut tax rates under new income tax know details

Centre mulls cutting tax rates in new income tax regime
Story first published: Thursday, August 25, 2022, 16:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X