For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనంపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: నగదు విత్‌డ్రా పైనా

|

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనంపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ రిజర్వుబ్యాంకు నుంచి మారటోరియాన్ని ఎదుర్కొంటోన్న ఆ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేస్తారంటూ కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వంపై నిలిచింది. అదే సమయంలో దేశ రాజధానిలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కావడం వల్ల.. విలీన ప్రతిపాదనలపై ఆమోదం లభిస్తుందని అందరూ ఆశించారు.

గ్రేటర్‌పై గులాబీ జెండా అంత ఈజీ కాదా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ: పరిహారం కోసం

ఊహించినట్టే- లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒకరకంగా చెప్పాలంటే- ఈ ఆమోదంతో విలీన ప్రక్రియ ఆరంభమైనట్టే. దీనితో పాటు ఖాతాదారులకు మరో శుభవార్తను వినిపించింది కేంద్ర కేబినెట్. ఇకపై ఖాతాదారులు.. తాము డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడంపైఆంక్షలు ఉండబోవని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

Union Cabinet approves Scheme of Amalgamation of Lakshmi Vilas Bank with DBS Bank

కొద్దిసేపటి కిందట ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. తమ డిపాజిట్ల కోసం ఖాతాదారులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విలీన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఆ ప్రక్రియ ఇక ఆరంభమైనట్టేనని చెప్పారు. వీలైనంత వేగంగా విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఖాతాదారుల డిపాజిట్లకు పూర్తి భరోసా ఇస్తున్నామని అన్నారు.

ఈ నేపథ్యంలో డీబీఎస్ ఇండియా లిమిటెడ్.. అదనంగా మరో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి మొత్తాన్ని పెట్టబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విలీనం అనంతరం లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారుల విత్ డ్రా సొమ్మును చెల్లించడానికి వీలుగా అదనపు పెట్టుబడిని పెట్టనున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. నష్టాల్లో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం తరువాత కూడా డీబీఐఎల్ బ్యాలెన్స్ షీట్ మెరుగ్గా ఉంటోంది. డీబీఎస్ బ్యాంకు క్యాపిటల్ రిస్క్ అస్సెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) 12.51 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

గుడ్‌న్యూస్: లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనంపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: నగదు విత్‌డ్రా పైనా | Union Cabinet approves Scheme of Amalgamation of Lakshmi Vilas Bank with DBS Bank

Union Cabinet approves Scheme of Amalgamation of Lakshmi Vilas Bank with DBS Bank India Limited. With this, there'll be no further restrictions on depositors regarding the withdrawal of their deposits, Union Minister Prakash Javadekar said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X