For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..

|

RBI: ఈసారి బడ్జెట్లో మామూలు రొటీన్ విషయాలతో పాటు మరొక స్పెషల్ సర్పైజ్ కూడా దాగి ఉంది. గత సంవత్సరం నుంచి పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా చాలా మంది భారతీయులు EMIల భారం పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఈ వడ్డీ రేట్ల పెంపుకు బ్రేక్ వేసేందుకు తాజా బడ్జెట్ ప్రతిపాదనలు సహాయపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కారణం ఏమిటి...

కారణం ఏమిటి...

ఆర్థిక లోటు విషయంలో తగ్గుదల వడ్డీ రేట్లను నిర్ణయించే ఆర్బీఐ సభ్యులకు చాలా కీలకమైన అంశం. తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆర్థిక లోటు టార్గెట్లను చేరుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది సైతం తక్కువ టార్గెట్లను కేంద్రం నిర్వచించుకుంది. మీడియం టెర్మ్ లో ఇది జీడీపీలో 4.5 శాతానికి పరిమితం చేయనున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు.

ద్రవ్యోల్బణంపై యుద్ధం..

ద్రవ్యోల్బణంపై యుద్ధం..

గడచిన ఏడాది కాలంగా పరిమితులకు మించి పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ యుద్ధం చేస్తోంది. ఇందుకోసం వడ్డీ రేట్లను భారీగానే పెంచింది. అయితే గత సమావేశంలో మాత్రం రేట్ల పెంపులో దూకుడును కొంత తగ్గించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు RBI ఏకంగా 225 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. అయితే ఈ సారి ప్యానెల్ 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపును ప్రకటించవచ్చని అంచనాలు చెబుతున్నాయి.

రేట్ల పెంపు నిలిపివేత..

రేట్ల పెంపు నిలిపివేత..

ఫిబ్రవరి 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తదుపరి రేటు పెంపు చర్యలు ఉంటాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత రెపో రేటు 6.25 శాతం వద్ద ఉంది. రేట్ల పెంపు విషయంలో ప్రస్తుతం భారత రిజర్వు బ్యాంక్ దాదాపుగా గరిష్ఠ స్థాయి వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇంతకంటే ఎక్కువగా రేట్ల పెంపుకు వెళితే ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని వారు చెబుతున్నారు. అందువల్ల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపుకు RBI విరామం ఇస్తుందని వారు భావిస్తున్నారు. అంటే ఫిబ్రవరి తర్వాత రేట్ల పెంపు ఉండకపోవచ్చనేది నిపుణుల అంచనా.

English summary

RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే.. | Union Budget 2023 hints over pause of RBI rate hike after february know details

Union Budget 2023 hints over pause of RBI rate hike after february know details
Story first published: Friday, February 3, 2023, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X