2018-19 (జూలై-జూన్)లో అంతకుముందు ఏడాది కంటే భారతదేశంలో నిరుద్యోగిత రేటు తగ్గిందని ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. అంతకుముందు సంవత్సరం 2017-18 (జూలై-జూన్) మధ్య నిరుద్యోగిత రేటు 6.1 శాతం ఉండగా, 2018-19కి 5.8 శాతానికి తగ్గిందని ఈ డేటా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) వెల్లడించింది.

నిరుద్యోగిత రేటు తగ్గింది కానీ..
2018-19లో నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ షెడ్యూల్ కులాల్లో స్వల్పంగా 6.3 శాతం నుండి 6.4 శాతానికి పెరిగింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో కూడా నిరుద్యోగిత రేటు 4.3 శాతం నుండి 4.5 శాతానికి పెరిగింది. అదే బ్యాక్ వర్డ్ క్లాసెస్ విషయానికి వచ్చేసరికి 6 శాతం నుండి 5.9 శాతానికి స్వల్పంగా తగ్గింది. మొత్తంగా నిరుద్యోగిత రేటు మాత్రం తగ్గింది.

పట్టణ యువతలో నిరుద్యోగిత ఎంత తగ్గిందంటే
2018-19లో నిరుద్యోగిత రేటు 15-29 ఏళ్ల మధ్య అంతకుముందు ఏడాది 17.8 శాతం ఉండగా, 2018-19లో 17.3 శాతానికి తగ్గింది. పట్టణ యువతలో నిరుద్యోగిత రేటు అంతకుముందు ఏడాది 20.6 శాతంగా ఉండగా, 2018-19లో 20.2 శాతానికి తగ్గింది. పట్టణ పురుషులు - మహిళలు విషయానికి వస్తే 27.2 శాతం నుండి 25.7 శాతానికి తగ్గింది.

పురుషులు, మహిళల్లో నిరుద్యోగిత రేటు
పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంతకుముందు ఏడాది 6.2 శాతంగా ఉండగా, 2018-19లో 6 శాతానికి తగ్గింది. మహిళల్లో 5.7 శాతం నుండి 5.2 శాతానికి తగ్గింది. పట్టణాల్లో మొత్తం నిరుద్యోగిత రేటు 7.8 శాతం నుండి 7.7 శాతానికి తగ్గింది. గ్రామీణ నిరుద్యోగం 5.3 శాతం నుండి 5 శాతానికి తగ్గింది. లేపర్ ఫోర్స్ పార్టిసిపేటింగ్ రేట్ 2017-18లో 36.9 శాతంగా ఉండగా 2018-19లో 37.5 శాతానికి పెరిగింది.

అక్షరాస్యత ఆధారంగా...
అక్షరాస్యత ఆధారంగా సెకండరీ, అంతకంటే ఎక్కువ చదివిన వారి నిరుద్యోగిత రేటు 2017-18లో 11.4 శాతం ఉండగా, 2018-19లో 11 శాతానికి తగ్గింది. కాగా ఈ సర్వేను జూలై 2018-జూన్ 2019 మధ్య చేశారు. 1,01,579 నివాసాలకు గాను 55,812 గ్రామీణ, 45,767 పట్టణ ప్రాంతాల్లో సర్వే చేశారు. ఇదిలా ఉండగా, మందగమనం, కరోనా మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా ఉద్యోగాలు పోవడం వంటి కారణాలతో ఈసారి నిరుద్యోగిత రేటు పెరిగే అవకాశముంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications