For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన నిరుద్యోగిత రేటు, జనవరి-మార్చిలో 8.2 శాతానికి డౌన్

|

భారత్‌లో నిరుద్యోగిత రేటు తగ్గుముఖం పడుతోంది. జనవరి - మార్చి 2022 కాలంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అర్బన్ ప్రాంతంలోని నిరుద్యోగిత రేటు 8.2 శాతానికి తగ్గింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో (జనవరి-మార్చి 2021)లో ఇది 9.3 శాతంగా నమోదయింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడిస్తోంది. NSO 14వ కార్మిక శక్తి సర్వే వివరాలు వెల్లడించింది.

జనవరి - మార్చి 2021లో నిరుద్యోగిత రేటు అత్యధికంగా నమోదయింది. అంతకుముందు సుదీర్ఘకాలం లాక్ డౌన్, కరోనా ఆంక్షల కారణంగా దీంతో గత క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధికంగా కనిపించింది. 2021 అక్టోబర్ - డిసెంబర్ కాలంలో నిరుద్యోగి రేటు 8.7 శాతంగా నమోదయింది. వార్షిక ప్రాతిపదికన, త్రైమాసికం ప్రాతిపదికన నిరుద్యోగిత రేటు తగ్గింది.

Unemployment rate dips to 8.2% in January-March 2022

అర్బన్ మహిళల్లో నిరుద్యోగిత రేటు (15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) కూడా తగ్గింది. 2021 జనవరి - మార్చి కాలంలో 11.8 శాతంగా ఉండగా, 2022 ఇదే కాలంలో 10.1 శాతానికి క్షీణించింది. 2021 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10.5 శాతంగా నమోదయింది. మహిళా నిరుద్యోగిత రేటు కూడా ఏడాది ప్రాతిపదికన, త్రైమాసికం ప్రాతిపదికన తగ్గింది.

జనవరి-మార్చి 2021లో పురుషుల నిరుద్యోగిత రేటు 8.6 శాతంగా ఉండగా, ఇప్పుడు 2022లో మాత్రం 7.7 శాతానికి తగ్గింది. త్రైమాసికం పరంగా చూసినా అక్టోబర్-డిసెంబర్-2021 కాలం నాటి 8.3 శాతంతో పోలిస్తే తగ్గింది. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇధి 47.5 శాతంగా ఉంది. గత ఏడాది చివరి త్రైమాసికంలో ఇది 47.3 శాతంగా నమోదయింది.

English summary

భారీగా తగ్గిన నిరుద్యోగిత రేటు, జనవరి-మార్చిలో 8.2 శాతానికి డౌన్ | Unemployment rate dips to 8.2% in January-March 2022

The unemployment rate for persons aged 15 years and above in urban areas dipped to 8.2 per cent in January-March 2022 from 9.3 per cent in the year-ago quarter, showed a periodic labour force survey by the NSO.
Story first published: Friday, June 17, 2022, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X