For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indians Worry: ఆందోళనలో భారతీయులు.. ఆ 3 కారణాల వల్లే.. తాజా సర్వేలో వివరాలు ఇలా..

|

Indians Worry: ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ప్రస్తుతం అనేక సమస్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే దీనిపై నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రపంచం గురించి కొద్దిదా పక్కన పెడితే భారతీయులు వేటివల్ల ఎక్కువగా ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్స్ వర్రీ..

ఇండియన్స్ వర్రీ..

ప్రస్తుత తరుణంలో భారతీయులు ప్రధానంగా మూడు కారణాలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు. అవేంటంటే నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి అని పట్టణ భారతీయులు చెబుతున్నట్లు ఇప్సోస్‌ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఆసక్తికరంగా 'వాట్ వర్రీస్ ది వరల్డ్' సర్వే అక్టోబర్ నివేదిక ప్రకారం.. ప్రతి పది మంది పట్టణ భారతీయుల్లో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

నిరుద్యోగం..

నిరుద్యోగం..

గత నెల కంటే ద్రవ్యోల్బణం 2 శాతం పెరిగటం ప్రపంచవ్యాప్తంగా పౌరులందరికీ ప్రధాన ఆందోళనగా మారింది. నివేదిక ప్రకారం ప్రజలు ప్రపంచ పేదరికం, సామాజిక అసమానత, నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక & రాజకీయ అవినీతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Ipsos

Ipsos సర్వే..

Ipsos సర్వే..

ఆన్‌లైన్ ప్యానెల్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్ 23-అక్టోబర్ 7 మధ్య 29 దేశాల్లోని పౌరుల మధ్య Ipsos ఈ సర్వేను నిర్వహించింది. వాట్ వర్రీస్ ది వరల్డ్ సర్వే దేశాల్లో అత్యంత ముఖ్యమైన సామాజిక, రాజకీయ సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి నివేదిస్తుంది. కరోనా మహమ్మారి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తొలగిపోలేదని, మందగమనం భారత మార్కెట్ పై ప్రభావం చూపుతోందని ఇప్సోస్ ఇండియా CEO అమిత్ అదార్కర్ అన్నారు. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందన్నారు. దానివల్ల నేరాలు, అవినీతి, సామాజిక అసమానతలు పెరిగాయని చెప్పారు.

 వాతావరణం..

వాతావరణం..

ఇంధన ధరల నియంత్రణకు ప్రభుత్వ చర్యల కారణంగా భారతదేశం మంచి స్థితిలో ఉందని అమిత్ అన్నారు. అయితే అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణం పట్ల పట్టణ భారతీయులు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారని సర్వేలో తేలింది. అయితే ప్రభుత్వాలు ముందుగా వీటిని పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సానుకూల మార్కెట్..

సానుకూల మార్కెట్..

ఇండోనేషియాను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ అత్యంత సానుకూల మార్కెట్‌గా అవతరించింది. అయితే చాలా మంది పౌరులు తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 76 శాతం మంది పట్టణ భారతీయులు తమ దేశం సరైన దిశలో పయనిస్తున్నదని నమ్ముతున్నారు. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సానుకూల మార్కెట్‌గా కొనసాగుతోంది. 93% సౌదీ అరేబియా పౌరులు తమ దేశం సరైన మార్గంలో ఉందని నమ్మకంతో ఉన్నారు.

English summary

Indians Worry: ఆందోళనలో భారతీయులు.. ఆ 3 కారణాల వల్లే.. తాజా సర్వేలో వివరాలు ఇలా.. | unemployment, inflation, corruption worrying indians most latest survey revealed

unemployment, inflation, corruption worrying indians most latest survey revealed
Story first published: Sunday, October 30, 2022, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X