For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీవ్ర ఆర్థికమాంద్యంలోకి బ్రిటన్, మరిన్ని ఇబ్బందులు కానీ.. రిషి సునక్ ఏమన్నారంటే?

|

2020 రెండో క్వార్టర్‌లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతమైంది. ఏకంగా 20.4 శాతం క్షీణతను నమోదు చేసింది. ఓ క్వార్టర్‌లో ఈ దేశానికి అత్యంత చెత్త ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. బ్రిటన్, సింగపూర్ వంటి సంపన్న దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నారు. రెండో క్వార్టర్ ఫలితాలతో బ్రిటన్ రిసెషన్‌లోకి వెళ్తున్న ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. అయితే ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే బ్రిటన్ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు.

<strong>సింగపూర్.. బాధాకరమైన నిజం! ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనం, రికవరీకి కూడా అవి బ్రేక్</strong>సింగపూర్.. బాధాకరమైన నిజం! ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనం, రికవరీకి కూడా అవి బ్రేక్

65 ఏళ్లలో దారుణ పతనం

65 ఏళ్లలో దారుణ పతనం

బ్రిటన్ క్వార్టర్లీ జీడీపీ 1955 నుండి ప్రారంభమైంది. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే ఇప్పటి వరకు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. జనవరి-మార్చితో పోలిస్తే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో పడిపోయినంతగా గత 65 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. దీంతో కార్యకలాపాలు క్లోజ్ అయ్యాయి. సేవారంగం, ఉత్పత్తి రంగం, కన్‌స్ట్రక్షన్ రంగం రికార్డ్ స్థాయిలో క్షీణించింది.

ఉద్యోగాలు పోయాయి.. మున్ముందు మరిన్ని ఇబ్బందులు

ఉద్యోగాలు పోయాయి.. మున్ముందు మరిన్ని ఇబ్బందులు

ప్రస్తుత గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, యూకే ఆర్థికమంత్రి రిషి సునక్ ఓ ప్రకటనలో అన్నారు. కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారని, మరింత బాధాకరమైన విషయం ఏమంటే రానున్న రోజుల్లో ఈ ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వీటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోవచ్చునని, ఆ భరోసా కచ్చితంగా ఇవ్వగలనని చెప్పారు.

యూకే బేజారు

యూకే బేజారు

2019 ముగింపుతో పోలిస్తే 2020 మొదటి ఆరు నెలల్లో యూకే ఆర్థిక ఉత్పత్తి 22.1 శాతం పడిపోయింది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే రెండింతలు నష్టపోయింది. 2020 మొదటి అర్ధ సంవత్సరంలో యూకే వృద్ధి రేటు మైనస్ 22.1 శాతంగా ఉంటే, ఫ్రాన్స్ మైనస్ 18.9 శాతం, ఇటలీ మైనస్ 17.1 శాతం, జర్మనీ మైనస్ 11.9 శాతం, అమెరికా మైనస్ 10.6 శాతంగా ఉంది.

సంక్షోభంలోకి బ్రిటన్..

సంక్షోభంలోకి బ్రిటన్..

G7 ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ కంటే మిగతా దేశాల క్షీణత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కెనడా జీడీపీ గత క్వార్టర్‌లో 12 శాతం క్షీణించింది. జపాన్ జీడీపీ 7.6 శాతం క్షీణిస్తుందని అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎక్కువ ప్రభావం పడిందని చెబుతున్నారు. అయితే ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా మాత్రం కోలుకుంటోంది. కరోనా పుట్టింది ఆ దేశంలోనే. ప్రపంచానికి కరోనా ప్రమాదాన్ని ఆలస్యంగా తెలియజేయడంతో పాటు అంతర్గతంగా చర్యలు తీసుకోవడం వల్ల, అలాగే వాస్తవ నష్టాన్ని దాచి పెట్టడం వల్ల చైనా పరిస్థితి అర్థం కావడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద ఎకానమీల్లో ఒకటైన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2009 తర్వాత తొలిసారి మిగతా దేశాల కంటే ముందు సంక్షోభంలోకి వెళ్తున్నట్లుగా డేటా ద్వారా వెల్లడవుతోందని అంటున్నారు.

జూన్‌లో రికవరీ సంకేతాలు

జూన్‌లో రికవరీ సంకేతాలు

ఇదిలా ఉండగా, జాతీయ గణాంకాల కార్యాలయం జూన్ నెలలో కోలుకునే సంకేతాలు ఉన్నాయని తెలిపింది. జూన్ నెలలో బ్రిటన్ జీడీపీ మే నెలతో పోలిస్తే 8.7 శాతం పెరిగిందని, అయినప్పటికీ జూన్ నెలలో బ్రిటన్ జీడీపీ 2020 ఫిబ్రవరితో పోలిస్తే తగ్గిందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో కరోనాతో బ్రిటన్ దెబ్బతినలేదు. అయితే, మార్చి 24 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సంవత్సరం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌కు ముందు ఉన్నస్థాయికి చేరుకోకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గత వారం తెలిపింది. నిరుద్యోగం భారీగా పెరుగుతుందని బ్యాంక్ హెచ్చరించింది.

English summary

తీవ్ర ఆర్థికమాంద్యంలోకి బ్రిటన్, మరిన్ని ఇబ్బందులు కానీ.. రిషి సునక్ ఏమన్నారంటే? | UK into deepest recession of any major economy

UK economic output shrank by 20.4% in the second quarter of 2020, the worst quarterly slump on record, pushing the country into the deepest recession of any major global economy.
Story first published: Thursday, August 13, 2020, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X