For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jeremy Hunt: నిజం బయటకు.. షాక్ లో బ్రిటన్ ప్రజలు.. రిషి సునక్ ప్లాన్ ఏంటంటే..

|

UK Recession: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాంద్యం గురించి భయపడుతున్నాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి గణాంకాలు పెద్ద తిరోగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక మాంద్యంపై అధికారికంగా ఏ దేశమూ నోరు విప్పనప్పటికీ.. బ్రిటన్‌లోని రిషి సునక్ ప్రభుత్వం నిజాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు వెల్లడించింది. ఈ వార్తతో అక్కడి ప్రజలు తలలుపట్టుకుంటున్నారు.

ఫైనాన్స్ మినిస్టర్..

ఫైనాన్స్ మినిస్టర్..

2008 ఆర్థిక మాంద్యం అధికారిక ప్రకటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు, ప్రభుత్వాలు దారుణమైన నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ సారి తొలుత బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్న జెరెమీ హంట్ నిజాన్ని బయట పెట్టారు. యూకే ఆర్థికం ఇప్పటికే మాంద్యంలో ఉందని వెల్లడించారు. దీంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

పన్నుల పెంపు..

పన్నుల పెంపు..

UK ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నప్పటికీ.. రిషి సునక్ ప్రభుత్వం దాదాపు 55 బిలియన్ యూరోల విలువైన పన్ను పెంపుదల, వ్యయ కోతల ప్లాన్ ను ప్రకటించింది. బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ మాట్లాడుతూ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి గణనీయమైన వ్యయాల కోత అవసరమని తెలిపారు. ప్రజలు డబ్బు ఖర్చుచేయటం నిదానంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్..

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్..

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందని బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ హెచ్చరించింది. ఇది 2024 వరకు కొనసాగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం బ్రిటన్ లో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠాన్ని తాకటంతో రానున్న రెండు సంవత్సరాల కాలం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని జెరెమీ హంట్ వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 11.1 శాతంగా ఉండటం ప్రజల ఆదాయాలు, పొదుపులు, వ్యాపార వృద్ధిని తినేస్తోంని హంట్ అన్నారు.

యుద్ధ బీభత్సం..

యుద్ధ బీభత్సం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రిటన్ తో పాటు యూరప్‌ దేశాలను ఇంధన కొరత వెంటాడుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చటం ప్రస్తుత విషమ పరిస్థితులకు దారితీసింది. అయితే ప్రస్తుత తరణంలో కొత్త ప్రధాని రిషి సునక్ వీటిని ఎలా అధిగమించి ఆర్థిక పతనాన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఆర్థిక నిపుణులు సైతం వీటిని పరిశీలిస్తున్నారు.

Read more about: rishi sunak recession
English summary

Jeremy Hunt: నిజం బయటకు.. షాక్ లో బ్రిటన్ ప్రజలు.. రిషి సునక్ ప్లాన్ ఏంటంటే.. | uk finance minister Jeremy Hunt revealed britan was already in recession

uk finance minister Jeremy Hunt revealed britan was already in recession
Story first published: Friday, November 18, 2022, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X