For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో ఉబెర్ ఫిన్ టెక్ కేంద్రం, 100 మందికి ఉద్యోగ అవకాశాలు

|

రైడ్ హైలింగ్ సేవలు అందించే ఉబెర్... హైదరాబాద్ పై తన ప్రేమను మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఇండియా ఆపరేషన్స్ కు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్న ఈ అమెరికా స్టార్టప్ కంపెనీ... త్వరలోనే ఇక్కడ ఒక ఫిన్ టెక్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అది కూడా గ్లోబల్ ఫిన్ టెక్ సెంటర్ కావటం విశేషం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉబెర్ ఇలాంటి ఒక గ్లోబల్ ఫిన్ టెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి కావటం మరో విశేషం. ప్రస్తుతం ఆర్థిక సేవలు, ఉత్పత్తుల రూపకల్పన కోసం ఉబెర్ కు నాలుగు కేంద్రాలున్నాయి. అందులో మూడు అమెరికాలోనే ఉండగా ఒకటి మాత్రం యూరోప్ లో ఉంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, పాలో ఆల్టో, న్యూయార్క్ నగరాల్లో ఉండగా.. యూరోప్ లోని ఆమ్స్టర్డామ్ లో మరో ఫిన్ టెక్ బృందం పనిచేస్తోంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న కేంద్రం... ప్రపంచవ్యాప్తంగా ఉబెర్ లో జరిగే ఆర్థిక లావాదేవీల ఫీచర్స్ ను మరింతగా మెరుగుపరిచేందుకు పనిచేస్తుందని ఉబెర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. డ్రైవర్ల కు సంబంధించిన అకౌంట్ డెబిట్ తో పాటు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వాలెట్ సేవల విస్తృతి పెంచేందుకు వినియోగదారులకు మరింత మెరుగైన, సౌకర్యమంతమైన సేవలను అందించేందుకు కృషిచేస్తుంది. ఈ మేరకు కొన్ని ప్రముఖ ఫైనాన్సియల్ పేపర్ల లో కథనాలు ప్రచురితమయ్యాయి.

100 మంది ఉద్యోగులు...

100 మంది ఉద్యోగులు...

హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఫిన్ టెక్ సెంటర్ లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తారని ఉబెర్ తెలిపింది. వీరంతా ఇంజనీరింగ్ సేవలతో పాటు డేటా సైన్స్, అనలిటిక్స్, ప్రోడక్ట్ మానేజ్మెంట్ తదితర సేవలు అందిస్తారు. తద్వారా హైదరాబాద్ లోని కేంద్రాన్నిఉబెర్ కోసం పూర్తి స్థాయి సాంకేతిక కేంద్రంగా మలచబోతున్నామని ఆ సంస్థ ఇంజనీరింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఉబెర్ సైట్ లీడర్ నాగ కాసు వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉబెర్ కు దేశంలోనే అతిపెద్ద కార్యాలయం ఉంది. ఇండియన్ ఆపరేషన్స్ కు హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావటం తెలిసిందే.

అక్టోబర్ లో ఉబెర్ మనీ...

అక్టోబర్ లో ఉబెర్ మనీ...

ప్రస్తుతం అమెరికా లో అందిస్తున్న బ్యాంకింగ్ పేమెంట్లు, ఆర్థిక సేవల తరహాలో భారత్ లోనూ తమ సేవలు ప్రారంభించనున్నామని ఉబెర్ పేర్కొంది. ఉబెర్ మనీ పేరుతొ ప్రస్తుతం అమెరికాలో ఇవి అందుబాటులో ఉండగా... ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ లోనూ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉబెర్ సీఈఓ దార ఖోశ్రోసామీ ఇండియాలోని హైదరాబాద్, బెంగుళూరు టెక్ సెంటర్ల పై అధిక ఫోకస్ పెడుతున్నారని తెలిసింది. ఈ కేంద్రాలపై దీర్ఘకాలిక పెట్టుబడులను రెట్టింపు చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇక్కడ బృందాలు ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్, మొబైల్, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్ విభాగాలపై పనిచేస్తున్నాయి.

గూగుల్ పే, ఫోన్ పే లకు పోటీ..

గూగుల్ పే, ఫోన్ పే లకు పోటీ..

ఉబెర్ మనీ సేవలు భారత్ లో అందుబాటులోకి వస్తే ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఇప్పటికే ఈ విషయంలో గూగుల్ పే చాలా ముందుంది. ఆలస్యంగా వచ్చినా మెరుగైన ఆఫర్లను ప్రకటించి పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించింది. మరోవైపు ఫ్లిప్కార్ట్ కు చెందిన ఫోన్ పే, పేటీఎం వంటి ఆప్ లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. యూపీఐ ఆధారంగా పనిచేసే పేమెంట్ ఆప్ లు ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అయ్యాయి. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్ల కు గిరాకీ పెరగటంతో వినియోగదారులు వీటిని ఆశ్రయిస్తున్నారు. ఇకపై ఉబెర్ కూడా ప్రవేశిస్తే ఈ పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary

Uber to build 100 member global fintech team in Hyderabad

Ride-hailing company Uber plans to set up a 100-member global fintech team in Hyderabad, the first such in the Asia-Pacific region. The Uber Money global financial services and products team is already present in San Francisco, Palo Alto, New York and Amsterdam.
Story first published: Thursday, February 13, 2020, 21:39 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more