For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీ బాయ్ అవతారమెత్తిన లక్షల కోట్ల అధిపతి, ఉబెర్ సీఈవో ఎంత సంపాదించారంటే

|

ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహీ సాధారణ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఆయన లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన కంపెనీకి సీఈవో. అయినప్పటికీ తన డెలివరీ ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా ఫుడ్ డెలివరీ చేశాడు. గత వారంలో దారా ఖోస్రోషాహీ ఉబెర్ ఈట్స్ తరఫున సైకిల్ పైన డెలివరీ చేశాడు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్లు పంచుకున్నారు. రెండు రోజుల పాటు సైకిల్ పైన ఫుడ్ డెలివరీ చేశారు.

దారా ఖోస్రోషాహీ మొదటి రోజు 3.5 గంటలు డెలివరీ బాయ్‌గా వర్క్ చేసి పది ట్రిప్స్ డెలివరీ చేశారు. గంటకు దాదాపు రూ.30 డాలర్లు సంపాదించారు. మన కరెన్సీలో దాదాపు రూ.7000కు పైగా సంపాదించాడు. ఆ తర్వాత రెండో రోజు కూడా ఆరు ట్రిప్స్ డెలివరీ చేసి 50 డాలర్లు సంపాదించారు. ఆయన మాస్కు ధరించి డెలివరీ చేయడంతో ఎవరు కూడా గుర్తు పట్టలేకపోయారు.

Ubers Dara Khosrowshahi delivers food orders in US, gets $100 in a day

కాగా, దారా ఖోస్రోషాహీ 2020 సంవత్సరంలో వేతనం, ఇతర భత్యాలు కలుపుకొని మొద్దం 12 మిలియన్ డాలర్లు ఆర్జించారు. దారా ఖోస్రోషాహీ డెలివరీపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కిందిస్థాయి ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇది మంచి ఆలోచన అని కొందరు ప్రశంసించారు. మరికొందరి ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నారు.

English summary

డెలివరీ బాయ్ అవతారమెత్తిన లక్షల కోట్ల అధిపతి, ఉబెర్ సీఈవో ఎంత సంపాదించారంటే | Uber's Dara Khosrowshahi delivers food orders in US, gets $100 in a day

Uber CEO Dara Khosrowshahi delivered food to customers ordering through the Uber Eats app in San Francisco.
Story first published: Wednesday, June 30, 2021, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X