For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లీకైన Uber అక్రమాల చిట్టా.. 2013-2017 మధ్య ఇన్ని తప్పులా.. తప్పించుకునేందుకు సాఫ్ట్‌వేర్‌..

|

Uber Files: కేవలం పదేళ్లలోనే భారతదేశంలో Uber బ్రాండ్ గుర్తింపు పొందింది. గతంలో సిలికాన్ వ్యాలీ స్టార్టప్ అయిన ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 44 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే వ్యాపారం కోసం చట్టాలను ఉల్లంగించటం, చట్టసభ సభ్యులను ప్రభావితం చేయటం, చట్టాల్లో లొసుగులను వినియోగించటం వంటి వాటికి పాల్పడినట్లు లీకైన ఊబర్ ఫైల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను గార్డియన్ వార్తా సంస్థ.. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ)కి అందించింది. ఇందులో ఉబెర్ కు చెందిన 1,24,000 అంతర్గత ఈ-మెయిల్‌లు, టెక్స్ట్ సందేశాలు, పత్రాలు ఉన్నాయి.

 విషపూరితమైన వర్క్ కల్చర్..

విషపూరితమైన వర్క్ కల్చర్..

కంపెనీ మునుపటి CEO ట్రావిస్ కలానిక్ సమయంలో విషపూరితమైన వర్క్ కల్చర్ ప్రోత్సహించాడని, ఉబెర్‌లో లైంగిక వేధింపులు, లింగ వివక్షను కూడా పట్టించుకోలేదని వెలుగులోకి వచ్చింది. డిసెంబరు 2014లో న్యూఢిల్లీలో 25 ఏళ్ల ప్రయాణికురాలిపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్న డ్రైవర్‌కు ఉబెర్ బాధ్యత వహించకుండా ప్రభుత్వాన్ని నిందించింది. ఈ వ్యవహారంలో తాము చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఉబెర్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నైరీ హౌర్డాజియాన్.. తన సహ ఉద్యోగికి రాసిన ఈ- మెయిల్ సంచలనంగా మారింది.

అంతర్గత అక్రమ సాఫ్ట్ వేర్లు..

అంతర్గత అక్రమ సాఫ్ట్ వేర్లు..

Uber ప్రభుత్వ దాడులను తప్పించుకోవడానికి అంతర్గత సాఫ్ట్‌వేర్‌ను ఆపడానికి "కిల్ స్విచ్" అని పిలువబడే అంతర్గత వ్యూహాన్ని కలిగి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రభుత్వ దాడులను నిలువరిస్తూ.. కంపెనీ ప్రాథమిక డేటా సిస్టమ్‌లకు యాక్సెస్‌ను నిలిపివేసేందుకు IT సిబ్బందికి ఆర్డర్ ఇస్తుంది. ఇలా అధికారులకు అవసరమైన డేటా దర్యాప్తులను అడ్డుకుంటుంది. దీనిని కంపెనీ హంగేరీ, రొమేనియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, భారతదేశంలో దాడుల సమయంలో కనీసం 12 సార్లు ఉపయోగించినట్లు తేలింది.

 అమెరికా అధ్యక్షుడితో స్నేహం..

అమెరికా అధ్యక్షుడితో స్నేహం..

ప్రపంచవ్యాప్త స్థానిక టాక్సీ సేవలను అణగదొక్కడానికి కంపెనీ జాతీయ అధికారులతో ఎలా సన్నిహితంగా సహకరించిందో బహిర్గతం చేయబడిన Uber పత్రాలు చెబుతున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో సీఈవోకు ఉన్న స్నేహం ఇందులో చూడవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత US ప్రెసిడెంట్ జో బైడెన్ ఉబర్ సంస్థ ఎదుగుదలకు సహకరించినట్లు తెలుస్తోంది. లీక్ అయిన పత్రాల ప్రకారం.. బైడెన్.. మాజీ CEOని కలిసిన తర్వాత దావోస్‌లో తన షెడ్యూల్ చేసిన ప్రసంగాన్ని కూడా మార్చుకున్నారు. ఇలా ఉబర్ సంస్థ చేసిన అనేక అక్రమాలు తాజాగా లీక్ అయిన పత్రాల్లో బయట పడ్డాయి. ఇప్పుడు ఇవి ఉబర్ సంస్థపై ప్రభావం చూపుతాయా లేక ప్రభుత్వాలను కంపెనీ మేనేజ్ చేస్తుందేమో ఇప్పుడు చూడాలి.

Read more about: uber ఉబర్ joe biden
English summary

లీకైన Uber అక్రమాల చిట్టా.. 2013-2017 మధ్య ఇన్ని తప్పులా.. తప్పించుకునేందుకు సాఫ్ట్‌వేర్‌.. | Uber Company frauds and illegal activities came busted with leaked papers sensational facts in this of india too

Uber Company frauds and illegal activities came busted know full deetails
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X