For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారులో సెల్ఫీ.. ఉబెర్ కొత్త నిబంధనలు ఈ రోజు నుండి అమలు

|

ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కొత్త మాస్క్ వెరిఫికేషన్ నిబంధనలు తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉబెర్ కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశ పెట్టింది. మాస్క్ వెరిఫికేషన్ ఫీచర్ అనే విధానాన్ని ఈ రోజు నుండి భారత దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో మాస్క్ ధరించకుండా ఉబెర్‌లో ప్రయాణం చేసిన వారికి యాప్ ఆ సంగతిని గుర్తు చేస్తుంది.

అప్పుడు ఉబెర్‌ను తదుపరి రైడ్ కోసం బుక్ చేసుకునేవారు మాస్క్ ధరించి ఉన్న సెల్ఫీని పంపవలసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఎవరైనా వినియోగదారుడు మాస్క్ ధరించినప్పుడు ఆ విషయాన్ని డ్రైవర్ తన యాప్‌లో నమోదు చేస్తాడు. ఆ సమాచారం ఆధారంగా ఇది పని చేస్తుంది.

Uber brings mask verification selfies for riders in India

ఇప్పటికే ఉబెర్ తమ డ్రైవర్లకు మేనెలలోనే మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, గో ఆన్‌లైన్ చెక్ లిస్ట్, మాండేటరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ అరౌండ్ కోవిడ్ 19, రైడర్లకు మాస్కులు తప్పనిసరి, డ్రైవర్లకు ప్రీ-ట్రిప్ మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీ వంటి రక్షణాత్మక చర్యలు ఇదివరకే చేపట్టింది.

English summary

కారులో సెల్ఫీ.. ఉబెర్ కొత్త నిబంధనలు ఈ రోజు నుండి అమలు | Uber brings mask verification selfies for riders in India

Uber has introduced a new passenger verification requirement which will be an extra layer of safety measure with the ongoing COVID-19. The new move is mask verification which will ask passengers - especially those who have been called out by drivers for not wearing a mask on their earlier trips - to click a selfie which shows them wearing a mask.
Story first published: Monday, October 19, 2020, 22:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X