For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter: త్వరలో ట్విట్టర్ బ్యాంక్.. దివాళా దిశగా పయనం.. బులుగు పిట్ట పరిస్థితి ఏమిటి..?

|

Twitter: సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఎలాన్ మస్క్ రోజుకో ప్రకటనతో ఉద్యోగులను ఉలిక్కిపడేలా చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్విటర్‌లో ప్రకటనలు నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవటంతో కంపెనీ ఆర్థికంగా దివాళా దిశకు నడుస్తోందని ఎలాన్ మస్క్ చెప్పటం సంచలనంగా మారింది.

రెండు వారాల్లోనే..

రెండు వారాల్లోనే..

సజావుగా సాగుతున్న వ్యాపారాన్ని కేవలం రెండు వారాల్లోనే తన అనాలోచిత నిర్ణయాలతో దివాళా అంచునకు తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. కింది స్థాయి నుంచి కీలక పదవుల్లో ఉన్న సీనియర్లు సైతం కంపెనీని వీడటంతో ట్విట్టర్ ను కంపెనీకి తీరని నష్టాన్ని కలిగిస్తోందని చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో ట్విటర్‌లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ కమిషన్ వెల్లడించింది.

దివాళా పరిస్థితులు..

దివాళా పరిస్థితులు..

నవంబర్ 11న ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం కంపెనీ బిలియన్ డాలర్లను కోల్పోవచ్చని చెప్పటం సంస్థ ఉద్యోగులను కలవరానికి గురిచేసిందని సమాచారం. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా కంపెనీ దివాళా తీసే ప్రమాదం పొంచి ఉందని US ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ హెచ్చరించటంతో చాలా మంది టెక్కీలు సందిగ్ధంలో పడ్డారు. తమ భవిష్యత్తు ఏమిటా అనే ఆలోచనలు వారికి నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి.

ట్విట్టర్ బ్యాంక్..

ట్విట్టర్ బ్యాంక్..

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను ఒక బ్యాంకింగ్ సంస్థగా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఖాతాదారులకు రానున్న కాలంలో డెబిట్ కార్డులు, చెక్కులు, రుణాలు వంటి సౌకర్యాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల కంపెనీకి మంచి ఆదాయం లభిస్తుందని ఆయన ప్లాన్. గతంలో అంతర్జాతీయంగా చెల్లింపులు చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న 'PayPal' సహవ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్ దానిని నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు. దీనిని చూస్తుంటే తన ఆన్ లైన్ బ్యాంక్ X.com ఆలోచనతో ట్విట్టర్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ బ్యాంక్..

ట్విట్టర్ బ్యాంక్..

దీనివల్ల వినియోగదారులకు అన్ని సౌకర్యాలు ఒకేచోట లభిస్తాయని తెలుస్తోంది. దీని నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవటానికి వినియోగదారులు తమ అధీకృత బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అనుమతులు పొందేందుకు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయితే వినియోగదారుల సమాచారం, డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more about: twitter elon musk paypal
English summary

Twitter: త్వరలో ట్విట్టర్ బ్యాంక్.. దివాళా దిశగా పయనం.. బులుగు పిట్ట పరిస్థితి ఏమిటి..? | Twitter soon going to become bank amid bankruptcy news elon musk tables his plan

Twitter soon going to become bank amid bankruptcy news elon musk tables his plan
Story first published: Saturday, November 12, 2022, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X