For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ .. జర్మనీలో 8% క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర

|

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన డోనాల్డ్ ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపధ్యంలో యూఎస్ లో చెలరేగిన హింసాకాండతో ఆయన ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే . అయితే దీని ప్రభావం యూఎస్ లో ట్విట్టర్ షేర్ల మీద పడుతుంది.

జో బిడెన్ అధ్యక్ష ఎన్నిక ధృవీకరణ సమయంలో హింసాకాండ

జో బిడెన్ అధ్యక్ష ఎన్నిక ధృవీకరణ సమయంలో హింసాకాండ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులతో 2021 జనవరి 6, బుధవారం వాషింగ్టన్లో జో బిడెన్ అధ్యక్షుడిగా ఎలక్టోరల్ కాలేజీ ధృవీకరణను నిరసిస్తూ ర్యాలీ చెప్పటమే కాకుండా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. నాడు జరిగిన హింసాకాండలో నలుగురు మృతి చెందారు. ట్రంప్ తన అధ్యక్ష పదవి చివరి రోజులలో రెండవ అభిశంసనను ఎదుర్కొంటున్నారు .శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించే ప్రయత్నంలో డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దేశం యొక్క కాపిటల్ పై దాడి చేసిన తరువాత ఆయన రాజీనామా కోసం ఆందోళనలతో డిమాండ్ వినిపిస్తుంది.

సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ , ఫేస్ బుక్ సంస్థలపై విరుచుకుపడే యోచనలో ట్రంప్

సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ , ఫేస్ బుక్ సంస్థలపై విరుచుకుపడే యోచనలో ట్రంప్

ట్రంప్ తన చివరి 10 రోజుల్లో రాజీనామా చేసే ఆలోచనలో లేరని, మరింత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారని ఎఫ్ బి ఐ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అంతేకాదు డోనాల్డ్ ట్రంప్ తనట్విట్టర్ మరియు ఫేస్బుక్ ఖాతాలను తొలగించాయి. సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ , ఫేస్ బుక్ సంస్థలపై విరుచుకుపడాలని యోచిస్తున్నాడు. 2021, జనవరి 12, టెక్సాస్‌లోని అలమో పర్యటనతో ప్రారంభించి, తన విధాన విజయాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ చివరిరోజుల్లో ప్లాన్ చేసుకుంటున్నారని భావిస్తున్నారు.

జర్మనీలో క్షీణించిన ట్విట్టర్ షేర్లు

జర్మనీలో క్షీణించిన ట్విట్టర్ షేర్లు

డొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ తర్వాత జర్మనీలో ట్విట్టర్ షేర్లు 8% క్షీణించాయి . సోషల్ మీడియా సంస్థ యొక్క యుఎస్-లిస్టెడ్ షేర్లు సోమవారం ఉదయం ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 8% క్షీణించిన ట్లుగా తెలుస్తుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శుక్రవారం ఆలస్యంగా నిలిపివేసిన తరువాత తిరిగి ఈ వీక్ లో మొదటి ట్రేడింగ్ రోజున ట్విట్టర్ జర్మన్-లిస్టెడ్ షేర్లు 8% క్షీణించాయి.

ట్రంప్ ఖాతా నిలిపివేయటంతో ట్విట్టర్ షేర్ ధరలో క్షీణత

ట్రంప్ ఖాతా నిలిపివేయటంతో ట్విట్టర్ షేర్ ధరలో క్షీణత

బుధవారం యుఎస్ కాపిటల్ లో చెలరేగిన విధ్వంసకాండ తరువాత 88 మిలియన్ల మంది అనుచరులున్న ట్రంప్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడం మరింత హింసకు గురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోసోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ యొక్క యుఎస్-లిస్టెడ్ షేర్లు సోమవారం ఉదయం ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 8% క్షీణత దిశగా సాగాయి.

English summary

డొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ .. జర్మనీలో 8% క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర | Twitter shares slump 8 percent in Germany after President Donald Trump account suspension

The social media firm's US-listed shares were also off 8% in thin premarket trading on Monday morning.The company said suspension of Trump's account, which had more than 88 million followers.
Story first published: Monday, January 11, 2021, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X