For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter Employees: పిలిచి పీకేశారు.. ట్విట్టర్ ఉద్యోగి కష్టాలు.. భారతీయులకు గుడ్ న్యూస్..

|

Twitter Employees: ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఒక ఉద్యోగి తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. హెచ్-1B వీసాపై పనిచేస్తున్న అతని విషయంలో ఎలాన్ మస్క్ యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరించింది.

అసలు ఏం జరిగింది..

ఎలాన్ మస్క్ రాకతో ట్విట్టర్ లో భారీగా ఉద్యోగుల కోత మెుదలైందని మనందరికీ తెలిసిందే. అయితే హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఒక ఉద్యోగిని సైతం కంపెనీ తొలగించింది. అయితే తిరిగి ఉద్యోగంలోకి రావాలంటూ సదరు ఉద్యోగిని కంపెనీ పిలిచింది. క్రిటికల్ టాలెంట్ అని భావించినందున అతడిని కొద్ది సేపటి తర్వాత కంపెనీ పిలిచినప్పటికీ నిన్న రాత్రి మళ్లీ అతడిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందని వెల్లడించాడు.

కంపెనీ స్వార్థం..

కంపెనీ స్వార్థం..

ఆగమేఘాలపై సదరు ఉద్యోగిని తిరిగి పనిలోకి తీసుకున్న కంపెనీ.. డాక్యుమెంటేషన్ చేయమని, కోడ్ నమూనాలను అందించమని అడిగింది. అయితే కంపెనీ తొలివిడతలో తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతాన్ని ఆఫర్ చేసింది. కానీ పరిస్థితి ఇతని విషయంలో అధ్వానంగా ఉంది. పాపం అతనికి ట్విట్టర్ ఈ సారి కేవలం ఒక్కరోజు జీతాన్ని ఆఫర్ చేస్తూ కంపెనీని వీడాలని అకస్మాత్తుగా వెల్లడించిందని ఆతడు వాపోయాడు. అయితే తొలగింపుకు ఎలాంటి కారణం లేకుండానే తొలగింపబడినట్లు చెప్పాడు.

H1B వీసా..

H1B వీసా..

ట్విట్టర్ లో బలైన సదరు ఉద్యోగికి కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికి ఇప్పుడు కేవలం 60 రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే దీనికి సంబంధించిన బ్లైండ్ పోస్ట్ తొలగించబడినప్పటికీ.. దీని స్క్రీన్ షార్ట్స్ మాత్రం ట్విట్టర్లో వైరల్ గా మారాయి. ఇలా బుధవారం తొలగించబడిన వారిలో ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.

మస్క్ కన్ను భారతీయులపై..

మస్క్ కన్ను భారతీయులపై..

దాదాపు 5000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఎలాన్ మస్క్ కొత్త ఇంజనీర్లను భారత్ ఉంచి నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ట్విట్టర్ మానవ వనరుల విభాగం ఇంజనీర్లు, సేల్స్ ఉద్యోగుల నియామకాలను చేపడుతోంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 7000 నుంచి 2700కు తగ్గింది. మస్క్ తాజాగా ఇంజనీరింగ్ టీమ్ లను జపాన్, ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ లో పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

English summary

Twitter Employees: పిలిచి పీకేశారు.. ట్విట్టర్ ఉద్యోగి కష్టాలు.. భారతీయులకు గుడ్ న్యూస్.. | twitter employee called after firing laidoff again going viral

twitter employee called after firing laidoff again going viral
Story first published: Friday, November 25, 2022, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X