For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్

|

ముంబై: ఆర్బిట్రేషన్ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌కు బ్రేక్ పడింది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) కొనుగోలు చేసేందుకు రెండు నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్‌ను నిలిపివేయాలని అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా, తాత్కాలిక ఊరట లభిస్తూ తీర్పు వచ్చింది. దేశీయ చట్టాల మేరకు ఒప్పందం చేసుకున్నామని, ముందుకు వెళ్తామని రిలయన్స్ ప్రకటించగా, ఫ్యూచర్ గ్రూప్ అప్పీల్ చేయాలని భావిస్తోంది.

ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!

అమెజాన్ వాదన ఏమిటి?

అమెజాన్ వాదన ఏమిటి?

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత ఏడాది ఫ్యూచర్ కూపన్స్‌లో 49శాతం వాటాని కొనుగోలు చేసింది. ఫ్యూచర్ రిటైల్‌లో ఈ కంపెనీకి 7.3 శాతం వాటా ఉంది. తమతో ఒప్పందంలో భాగంగా ఫ్యూచర్ రిటైల్‌ను మూడేళ్ల నుండి పదేళ్ల తర్వాత కొనుగోలు చేసేందుకు, తొలి తిరస్కరణ హక్కులు, నాన్-కాంపీట్ ఒప్పంద హక్కులు తమకు ఉన్నాయని అమెజాన్ చెబుతోంది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ఈ హక్కులు ఉల్లంఘించేలా ఉందని సింగపూర్ ఆర్బిట్రేషన్‌లో అమెజాన్ సవాల్ చేసింది.

ఎందుకు ఈ పోటీ..

ఎందుకు ఈ పోటీ..

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలు ప్రపంచ సంపన్నులు. రిటైల్ రంగంలో భారత్‌లో ఆధిపత్యం కోసం పోటీ పడేందుకు సిద్ధమైనట్లుగా ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది. రిటైల్, లాజిస్టిక్ వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు ముఖేష్ కంపెనీ ఒప్పందం చేసుకోగా, దానిని నిలిపివేసి, తాము చేజిక్కించుకోవాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఈ-కామర్స్ రంగంలో పట్టు ఉంది. కానీ చిన్న నగరాలు, పట్టణాల్లోకి పూర్తిగా వెళ్లలేదు. ఫ్యూచర్ గ్రూప్‌కు చిన్న పట్టణాలు, నగరాల్లో గ్రాసరీ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు స్టోర్స్ ఉన్నాయి. దీనిని అందిపుచ్చుకోవాలని అమెజాన్ భావిస్తోంది. తద్వారా ఇప్పటికే తమకు పట్టున్న ఆన్‌లైన్‌కు, ఫ్యూచర్ గ్రూప్ ద్వారా ఆఫ్‌లైన్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రిలయన్స్ కూడా రిటైల్ ద్వారా భారీగా విస్తరణ ప్లాన్ చేస్తోంది. అందుకే అమెజాన్, రిలయన్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది.

ఫ్యూచర్ షేర్లు డౌన్

ఫ్యూచర్ షేర్లు డౌన్

ఫ్యూచర్ గ్రూప్‌కు సంబంధించి అమెజాన్‌తో టగ్ ఆఫ్ వార్ నేపథ్యంలో రిలయన్స్ స్టాక్స్ నిన్న భారీ నష్టాన్ని చూశాయి. నిన్న రిలయన్స్ ఏకంగా దాదాపు 4 శాతం నష్టపోయింది. అయితే ఈ రోజు స్వల్పంగా (0.26 శాతం) కోలుకున్నది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్ల ధర సోమవారం 10 శాతం పడిపోయింది. ఈ రోజు కూడా నష్టాల్లోనే కనిపించాయి.

English summary

భారత్‌పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్ | Twists And Turns in Amazon, Future Group, Reliance Retail issue

It’s Amazon.com Inc. 1 and Future Group 0.The legal battle between the two retail giants saw the first round go in favour of Amazon.
Story first published: Tuesday, October 27, 2020, 19:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X