For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కడ, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్తా: భారత టాప్ కార్పోరేటర్లతో ట్రంప్

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. స్టీల్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర కార్పోరేట్ రంగాలకు చెందిన సీఈవోలు, ప్రమోటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. అమెరికాలో వారి పెట్టుబడులు మెచ్చుకున్నారు. మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించారు.

డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన, మరిన్ని వాణిజ్య కథనాలు

ఎక్కడ, ఎలా, ఎంత... చెబుతా

ఎక్కడ, ఎలా, ఎంత... చెబుతా

అమెరికాలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి అనే అంశాలపై ప్రశ్నించాలనుకుంటే వాటికి సమాధానం ఇస్తానని పారిశ్రామికవేత్తలతో చెప్పారు. భారత్‌తో వివిధ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, 3బిలియన్ డాలర్ల హెలికాప్టర్ల కొనుగోలుపై తాజాగా ఒప్పందం కుదిరిందన్నారు.

మరిన్ని పెట్టుబడులు పెట్టండి

మరిన్ని పెట్టుబడులు పెట్టండి

అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పుతామన్నారు. అడ్డంకులను తొలగించి, నిబంధనల్ని మరింత సరళతరం చేస్తామన్నారు. మీ విజయాలకు నా శుభాకాంక్షలని, మీరు అమెరికాకు వచ్చి మరిన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మీ పెట్టుబడులు.. మాకు ఉద్యోగాలు

మీ పెట్టుబడులు.. మాకు ఉద్యోగాలు

మీరు పెట్టే పెట్టుబడులు తన దృష్టిలో ఉద్యోగాలు అని ట్రంప్ అన్నారు. ఈ భేటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీం ద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌ చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.

వాటిని పరిష్కరిస్తా..

వాటిని పరిష్కరిస్తా..

అమెరికాలో వ్యాపార నిర్వహణకు ఎన్నో రెగ్యులేటరీ సవాళ్లను, ముఖ్యంగా పాలనా, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆందోళనలపై ట్రంప్‌ స్పందించారు. ఆ ఇబ్బందులు తొలగిస్తామని, తేడాని మీరే త్వరలో గమనిస్తారని చెప్పారు. ఇరుదేశాల సంస్థలు పరస్పరం ఒకరి దేశంలో మరొకరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నారు.

ఉద్యోగాలు సృష్టించేది మీరే..

ఉద్యోగాలు సృష్టించేది మీరే..

పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వాలు పరిశ్రమలకు అనుకూల సవరణలు తెస్తారని, తద్వారా ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వాలు కేవలం సహాయం చేస్తాయని, నిజానికి ఉద్యోగాలను కల్పించేది ప్రయివేటు పరిశ్రమలే అన్నారు.

నేను... మోడీ..

నేను... మోడీ..

తాను భారత్‌లో, ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో ఉద్యోగాల్ని సృష్టిస్తున్నామని, తాను మోడీతో చాలా దగ్గరగా పని చేస్తున్నానని తెలిపారు. మోడీ పనితీరు భేష్ అన్నారు. కాగా, భారత్‌లో అమెరికా పెట్టుబడులు, వ్యాపారంపై దేశీయ పరిశ్రమ ట్రంప్‌ను కొనియాడింది.

English summary

ఎక్కడ, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్తా: భారత టాప్ కార్పోరేటర్లతో ట్రంప్ | Trump says will tell Indian industrialists where and how to invest in America

On the final day of his India visit, Unites States President Donald Trump held an interaction with the creme de la creme of India Inc ranging from sectors as diverse as steel and hospitality and automobiles, pharma and information technology.
Story first published: Wednesday, February 26, 2020, 8:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X