For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిర్ణయం, రూ.7 లక్షల కోట్ల భారీ నష్టం!

|

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్1బీ వీసాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేసిన విషయం తెలిసిందే. స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ కింద అమెరికా వచ్చే వీసాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నీర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం వేలాదిమంది భారతీయులు సహా ఇతర దేశస్తులపై పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. టీసీఎస్ సహా పలు దేశాల ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికా సంస్థలు కూడా పెద్ద ఎత్తున నష్టపోతాయని భావిస్తున్నారు.

HDFC, ICICI, SBI సహా బేజారు! టాప్ 10 బ్యాంకుల్లో ఈ ఒక్కటే అదరగొట్టిందిHDFC, ICICI, SBI సహా బేజారు! టాప్ 10 బ్యాంకుల్లో ఈ ఒక్కటే అదరగొట్టింది

రూ.7 లక్షల కోట్ల నష్టం

రూ.7 లక్షల కోట్ల నష్టం

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నిర్ణయం వల్ల అమెరికన్ సంస్థలు దాదాపు 100 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్లకు పైగా) నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు కొత్తగా హెచ్1బీ, ఎల్1వీసాల ఆంక్షలపై తీసుకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన జూన్ 22న సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఫార్చూన్ 500 కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ నష్టం విలువ దాదాపు రూ.7 లక్షల కోట్లకు సమానమని అగ్రరాజ్యానికి చెందిన ప్రముఖ బ్రోకింగ్స్ ఇనిస్టిట్యూట్ సంస్థ అంచనా వేసింది.

అమెరికా సంస్థలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

అమెరికా సంస్థలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

వీసీల నిలిపివేత వల్ల 2 లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికాకు రాలేకపోతారని భావిస్తున్నారు. విదేశాలకు చెందిన ప్రత్యేక నైపుణ్య నిపుణుల ద్వారా ఆయా కంపెనీల ఆదాయం, ఉత్పాదకత, పెట్టుబడి, ఆవిష్కరణల వంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు చెప్పడంతో పాటు అందుకు సంబంధించిన రుజువులను నివేదికలో పొందుపరిచారు. ఈ నిర్ణయం వల్ల వివిధ దేశాల స్కిల్డ్ వర్కర్స్ పైన ప్రభావం చూపడంతో పాటు, అమెరికా సహా పలు దేశాల కంపెనీలపై భారీ ప్రభావం పడటమే కాకుండా, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చేపడుతున్న చర్యలు తాజా నిర్ణయంతో మందగిస్తాయని నివేదికలో తెలిపింది.

మరో రూల్

మరో రూల్

ఇదిలా ఉండగా, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన మరో రూల్ విదేశీ విద్యార్థుల ప్రవేశకాలను పరిమితం చేస్తుందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. అమెరికన్లకే ఉద్యోగాలు అనే అంశంపై ట్రంప్ గత ఎన్నికల్లో ప్రధానంగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఆ దిశలోనే అడుగులు వేస్తున్నారు.

English summary

డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిర్ణయం, రూ.7 లక్షల కోట్ల భారీ నష్టం! | Trump's order on H1B visas for foreign workers cost USD 100 billion

President Trump's executive order restricting entry of skilled foreign workers into the US, mainly on H1B and L1 visas, has resulted in an estimated loss of USD 100 billion to companies here, a top American think-tank claimed.
Story first published: Friday, October 23, 2020, 19:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X