For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సద్దుమణిగిన ‘రింగింగ్ టైమ్’ వివాదం! ట్రాయ్ ఏం చెప్పిందంటే...

|

ఇన్‌కమింగ్ కాల్ రింగింగ్ టైమ్‌ విషయంలో టెలికాం కంపెనీల నడుమ తాజాగా తలెత్తిన వివాదానికి టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెరదించింది. మొబైల్ ఫోన్‌కు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు రింగింగ్ సమయం ఎంతసేపు ఉండాలి, అలాగే ల్యాండ్ లైన్‌కు కాల్ వచ్చినప్పుడు రింగింగ్ సమయం ఎంతసేపు ఉండాలో తేల్చి చెప్పేసింది.

దీంతో గత కొన్నాళ్లుగా టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాల నడుమ రాజుకున్న వివాదం సద్దుమణిగినట్లయింది. ట్రాయ్ తాజా ఆదేశాలతో అటు టెలికాం కంపెనీలే కాక ఇటు మొబైల్ వినియోగదారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అసలు గొడవేమిటంటే...

అసలు గొడవేమిటంటే...

ఒక టెలికాం నెట్‌వర్క్ నుంచి మరొక టెలికాం నెట్‌వర్క్‌కు కాల్ వెళ్లినప్పుడు కొంతసేపు మొబైల్ రింగ్ అవుతుంది. దీనికి నిర్ణీత సమయం ఉంటుంది. దీనినే ‘రింగ్ టైమ్'గా వ్యవహరిస్తారు. ఆ రింగ్ టైమ్ పూర్తి అయ్యేలోగా అవతలివాళ్లు కాల్ అందుకుంటే.. ఆటోమేటిక్‌గా కాల్ కనెక్ట్ అయిపోతుంది. అయితే ఇటీవల ఈ రింగ్ కాల వ్యవధిని టెలికాం కంపెనీలు గుట్టుచప్పుడుకాకుండా తగ్గించాయి. మొదట రిలయన్స్ జియో ఈ పని చేసింది. దీనిని గుర్తించిన వెంటనే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా తమ రింగింగ్ టైమ్‌ను తగ్గించాయి.

ఈ రింగ్ సమయం ఎంత ఉండాలి?

ఈ రింగ్ సమయం ఎంత ఉండాలి?

నిజానికి గతంలో ఈ ఇన్‌కమింగ్ కాల్ రింగ్ టైమ్ విషయంలో ఎలాంటి కాల పరిమితి లేదు. ఈ రింగ్ సమయం 30 నుంచి 45 సెకన్లుగా ఉండేది. 45 సెకన్ల వరకు రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే కాల్ డిస్ ‌కనెక్ట్ అయిపోయేది. మొదట ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. జియో లోగుట్టు తెలియగానే ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ కూడా అదేవిధంగా తమ నెట్‌వర్క్‌ వినియోగదారులకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతుండడంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు.

‘ఐయూసీ' తప్పించుకు ఎత్తుగడ...

‘ఐయూసీ' తప్పించుకు ఎత్తుగడ...

ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జి(ఐయూసీ)ని తప్పించుకునే ఎత్తుగడలో భాగంగానే టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఇలా ఇన్‌కమింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని తగ్గించాయి. సాధారణంగా ఒక టెలికాం నెట్‌వర్క్ నుంచి మరొక టెలికాం నెట్‌వర్క్‌కు కాల్ వెళ్లినప్పుడు.. కాల్ చేసిన నెట్‌వర్క్ వారు కాల్ ముగిసిన నెట్‌వర్క్‌కి ఈ రకమైన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే రిలయన్స్ జియో తన తెలివితేటలు ప్రదర్శించింది. తన నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే (అవతలి నెట్‌వర్క్‌లకు ఇన్‌కమింగ్ కాల్‌ అవుతుంది) కాల్స్ రింగ్ సమయాన్ని తగ్గించి.. ‘ఐయూసీ' చెల్లించకుండా తప్పించుకోవడం ప్రారంభించింది. దీంతో ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులకు మిస్డ్‌కాల్ అలర్ట్ వెళుతుంది. దాన్ని చూసి వారు తమకు మిస్డ్‌కాల్ ఇచ్చిన వారికి తిరిగి కాల్ చేస్తారు.. దీంతో ఇతర టెలికాం నెట్‌వర్క్‌లు జియోకి ఐయూసీ చెల్లించాల్సి వచ్చేది.

‘ట్రాయ్'కు ఫిర్యాదుల వెల్లువ...

‘ట్రాయ్'కు ఫిర్యాదుల వెల్లువ...

ఈ ఇన్‌కమింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని ‌నెట్‌వర్క్ ప్రొవైడర్లు తగ్గించుకోవడంపై ‘ట్రాయ్'కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ట్రాయ్.. టెలికాం కంపెనీల దుందుడుకుతనంపై చీవాట్లు పెట్టింది. అయితే రిలయన్స్ జియో ట్రాయ్‌కి ఓ లేఖ రాస్తూ.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇన్‌కమింగ్ కాల్ రింగ్ సమయం 15-20 సెకన్లు ఉంటే చాలునని ప్రతిపాదించింది. మరో నెట్‌వర్క్ ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా ఈ సమయం 30 సెకన్లు ఉంటే చాలుననగా.. ఎయిర్‌టెల్ మాత్రం ఈ రింగింగ్ సమయం 45 సెకన్లపాటు ఉండాలని ప్రతిపాదించింది.

‘ట్రాయ్' ఏం తేల్చిందంటే...

‘ట్రాయ్' ఏం తేల్చిందంటే...

అయితే ట్రాయ్ మాత్రం వొడాఫోన్ ఐడియా ప్రతిపాదనతో ఏకీభవించింది. ఇకమీదట మొబైల్ ఫోన్‌‌కు వచ్చే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని, అలాగే ల్యాండ్‌‌లైన్స్‌‌కు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌‌ రింగింగ్ సమయం 60 సెకన్లు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇకపై ఇన్‌‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు వినియోగదారులు ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా.. రింగ్ సమయాన్ని ఇన్‌‌కమింగ్ వాయిస్ కాల్స్‌‌ అలర్ట్‌‌కు తప్పనిసరిగా తెలియజేయాలంటూ నెట్‌వర్క్ ప్రొవైడర్లను ఆదేశించింది. ట్రాయ్‌ తాజా ఆదేశాలతో టెలికాం సంస్థల మధ్య ఈ విషయంలో నెలకొన్న వివాదం సమసినట్లయింది.

English summary

సద్దుమణిగిన ‘రింగింగ్ టైమ్’ వివాదం! ట్రాయ్ ఏం చెప్పిందంటే... | trai put an end to telecom network providers incoming ring dispute

The telecom regulator has mandated a minimum ring duration of 30 seconds for outgoing mobile calls before they are disconnected, and 60 seconds for such calls to landlines, a view that was backed by the older operators Bharti Airtel and Vodafone Idea but opposed by Reliance Jio, which wanted a shorter span of 15-to-20 seconds.
Story first published: Sunday, November 3, 2019, 19:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X