For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్‌లో ఎగుమతులు, దిగుమతులు ఎలా ఉన్నాయంటే? వాణిజ్యలోటు 8.7 బిలియన్ డాలర్లకు..

|

భారత మర్చంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ అక్టోబర్ 2020 నెలలో 8.7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. అంతకుముందు నెల అంటే సెప్టెంబర్ మాసంలో ఇది 2.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి తర్వాత నుండి ఎగుమతులు, దిగుమతులు పడిపోయిన విషయం తెలిసిందే. మన దేశం విషయానికి వచ్చేసరికి గతంలో కంటే ఎగుమతులు తగ్గినప్పటికీ, దిగుమతులు అంతకంటే తగ్గాయి.

సెప్టెంబర్ 2020లో వాణిజ్య లోటు(ట్రేడ్ డెఫిసిట్) 6.7 శాతంగా ఉంది. అక్టోబర్ నెలలో ఎగుమతులు 5 శాతం తగ్గినప్పటికీ, దిగుమతులు అంతకు రెట్టింపు కంటే ఎక్కువ 11.53 శాతం పడిపోయి వాణిజ్య లోటు 11.75 బిలియన్ డాలర్ల (రూ.87,713 కోట్లు) నుండి 8.71 బిలియన్ డాలర్లకు (రూ.65,016 కోట్లు) తగ్గింది.

పరిస్థితి అంతా సాధారణ స్థితికి, వ్యాక్సీన్ పంపీణీయే...: కరోనాపై బిల్ గేట్స్పరిస్థితి అంతా సాధారణ స్థితికి, వ్యాక్సీన్ పంపీణీయే...: కరోనాపై బిల్ గేట్స్

ఎగుమతులు మళ్లీ తగ్గాయి

ఎగుమతులు మళ్లీ తగ్గాయి

గత మూడు నెలల కాలంలో ఎగుమతులను చూస్తే ఆగస్ట్ నెలలో ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం తగ్గగా, సెప్టెంబర్‌లో 5.9 శాతం పెరగగా, అక్టోబర్ మాసంలో మళ్లీ 5.1 శాతం క్షీణించాయి. అక్టోబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన 5.1 శాతం తగ్గి 24.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. వరుసగా 6 నెలలు ఎగుమతులు పడిపోయిన అనంతరం సెప్టెంబర్‌లో 5.9 శాతం పెరిగాయి. అక్టోబర్‌లో మళ్లీ తగ్గాయి.

పెట్రోలియం, నాన్ పెట్రోలియం

పెట్రోలియం, నాన్ పెట్రోలియం

ఏడాది ప్రాతిపదికన పెట్రోలియం, చమురు, లుబ్రీకాంట్స్ ఉత్పత్తుల ఎగుమతులు ఆగస్ట్‌లో 40.3 శాతం క్షీణించగా, సెప్టెంబర్‌లో 4.9 శాతం పెరిగాయి. అక్టోబర్ నెలలో మళ్లీ 52 శాతం పడిపోయి 1.7 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

నాన్ పెట్రోలియం, ఆయిల్, లూబ్రికాంట్ ఉత్పత్తుల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్‌లో 8.3 శాతం క్షీణించగా, సెప్టెంబర్‌లో 6.1 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో కూడా 2 శాతం పెరిగి 23.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఈ ఎగుమతులు కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి.

దిగుమతులు ఇలా...

దిగుమతులు ఇలా...

ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో దిగుమతులు 26 శాతం, సెప్టెంబర్‌లో 19.6 శాతం, అక్టోబర్‌లో 11.5 శాతం క్షణించాయి. అక్టోబర్‌లో దిగుమతల వ్యాల్యూ 33.6 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా లాక్ డౌన్‌కు ముందు దిగుమతులు 40 బిలియన్ నమోదయింది.

పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్‌లో 41.4 శాతం, సెప్టెంబర్‌లో 35.9 శాతం, అక్టోబర్‌లో 38.5 శాతం చొప్పున తగ్గాయి. అక్టోబర్ నెలలో దిగుమతులు 5-7 బిలియన్ డాలర్లుగా ఉంది.

నాన్-పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్‌లో 20.2 శాతం, సెప్టెంబర్‌లో 14.4 శాతం, అక్టోబర్‌లో 2.2 శాతం తగ్గాయి.

English summary

అక్టోబర్‌లో ఎగుమతులు, దిగుమతులు ఎలా ఉన్నాయంటే? వాణిజ్యలోటు 8.7 బిలియన్ డాలర్లకు.. | Trade deficit worsens to 8.7 billion dollars in October

The country's merchandise trade deficit worsened to $8.7 billion in October 2020 from $2.7 billion in the preceding month.
Story first published: Monday, November 23, 2020, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X