For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోలోకి 7 వారాల్లో 9వ పెట్టుబడి, రూ.4,547 కోట్లతో TPG 0.9% వాటా

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రెండు నెలల లోపు (7 వారాల్లో) ఇది తొమ్మిదో పెట్టుబడి. అమెరికా ప్రయివేటు ఈక్విటీ కంపెనీ టీపీజీ రూ.4,564.80 కోట్ల పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.93 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల వద్ద ఈ డీల్ కుదిరింది.

ఈ పెట్టుబడితో జియో మొత్తం రూ.102,432.15 సమీకరించింది. టీపీజీ క్యాపిటల్-రిలయన్స్ మధ్య పెట్టుబడుల అంశంపై చర్చలు సాగుతున్నాయని, త్వరలో ప్రకటన వెలువడనుందని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇప్పుడు డీల్‌పై ప్రకటన వచ్చింది. ఇప్పటికే అమెరికాకు చెందిన కేకేఆర్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటింక్ ఇన్వెస్ట్ చేశాయి.

TPG to invest Rs 4547 crore in Jio Platforms, 9th investment in 7 weeks

టీపీజీకి ముందు . జియో ప్లాట్‌ఫాంలోకి రూ.97,885.65 కోట్లు లేదా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడు వారాల్లో 8 కంపెనీలు 21 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫేస్‌బుక్‌తో ఈ పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైంది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల, సిల్వర్ లేక్ (రెండోసారి), ఏడీఏఐలు పెట్టుబడి పెట్టాయి.

ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు...

- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
- TPG (తాజా పెట్టుబడి) - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

English summary

జియోలోకి 7 వారాల్లో 9వ పెట్టుబడి, రూ.4,547 కోట్లతో TPG 0.9% వాటా | TPG to invest Rs 4547 crore in Jio Platforms, 9th investment in 7 weeks

TPG has become the latest company to join a marquee group of investors in Jio Platforms with an investment of over Rs 4,500 crore for a 0.93 percent stake in the company.
Story first published: Saturday, June 13, 2020, 21:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X