For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన బడ్జెట్ కంటే 63మంది బిలియనీర్ల సంపదే ఎక్కువ, సీఈవో స్థాయి శాలరీ కోసం 22,000 ఏళ్లు

|

దావోస్: భారత్‌లోని కుబేరుల వద్ద పెద్ద ఎత్తున సంపద ఉంది. అది ఎంత అంటే కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ. భారత్‌లోని కేవలం 63 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపద... 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (రూ.24.42 లక్షల కోట్లు) కంటే ఎక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది.

జెఫ్ బెజోస్‌పై మోడీ ప్రభుత్వానికి అసంతృప్తి ఇందుకేనా?

63 మంది బిలియనీర్ల వద్ద ఎంత సంపద అంటే

63 మంది బిలియనీర్ల వద్ద ఎంత సంపద అంటే

దేశంలోని ఒక్క శాతం సంపన్నుల వద్ద ఉన్న సంపద... 70 శాతం జనాభా అంటే 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF)కు చెందిన హక్కుల సంస్థ ఆక్స్‌ఫాం అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి.

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

WEF 50వ వార్షిక సమావేశానికి ముందు టైమ్ టు కేర్ (Time to Care) పేరుతో ఆక్స్‌ఫాం ఈ అధ్యయాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కేవలం 2,153 మంది బిలియనీర్ల వద్దనే... 60 శాతం మంది అంటే 460 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే ఎక్కువ ఉంది.

ఆందోళన కలిగించే అంశం

ఆందోళన కలిగించే అంశం

దశాబ్దంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఆక్స్‌ఫాం నివేదిక పేర్కొంది. గత సంవత్సరాల్లో కుబేరుల ఆస్తులు క్షీణించినప్పటికీ, బిలియనీర్ల సంఖ్య పెరిగిందని పేర్కొంది. ధనిక, పేదల మద్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమని, కేవలం కొన్ని ప్రభుత్వాలే దీనికి కట్టుబడి ఉన్నాయని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ అన్నారు.

ఈ అంశాలు చర్చకు

ఈ అంశాలు చర్చకు

WEF ఐదు రోజుల శిఖరాగ్ర సదస్సు సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ సదస్సులో ఆర్థిక అసమానతలు, లింగబేధం అంశాలు చర్చకు రానున్నాయి. స్థూల ఆర్థిక బలహీనతలు, ఆర్థిక అసమానతలతో గత ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందని కూడా వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు చెందిన గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ హెచ్చరించింది.

వారి ప్రయోజనాలు పణంగా పెట్టి

వారి ప్రయోజనాలు పణంగా పెట్టి

WEF నివేదిక ప్రకారం దాదాపు ప్రతి ఖండంలోను సామాజిక అశాంతి కనిపిస్తోంది. మరోవైపు, సాధారణ ప్రజలు ముఖ్యంగా పేద మహిళలు, చిన్నారుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాల్ని పణంగా పెట్టి సంపన్నులు మరో మెట్టు ఎక్కుతున్నారని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

సీఈవో టైప్ వేతనం కార్మికురాలికి రావాలంటే 22వేల ఏళ్లు

సీఈవో టైప్ వేతనం కార్మికురాలికి రావాలంటే 22వేల ఏళ్లు

టెక్నాలజీ కంపెనీల సీఈవోలు తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. మహిళలు, చిన్నారులు చేసే పనులకు సరైన వేతనం దక్కడం లేదని తెలిపింది. పేదరికం, అసమానతలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నిధుల్ని సమీకరించడంలో ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులపై భారీగా పన్నులను వడ్డించడంలో విఫలమవుతున్నాయని పేర్కొంది.

10 నిమిషాల్లో సంపాదించే ఆదాయం ఏడాదిలో కార్మికుడికి

10 నిమిషాల్లో సంపాదించే ఆదాయం ఏడాదిలో కార్మికుడికి

టెక్ సీఈవో వంటి వారి ఆదాయాలు వేగంగా పెరుగుతున్నాయని, ఓ విధంగా సెకనుకు రూ.106 చొప్పున 10 నిమిషాల్లో వారు సంపాదించే ఆదాయం ఓ డొమెస్టిక్ కార్మికుడు ఏడాదిలో మాత్రమే సంపాదించగలుగుతున్నాడని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, అమ్మాయిలు ప్రతి రోజు 3.26 బిలియన్ హవర్స్ అన్‌పెయిడ్ వర్క్ చేస్తున్నారని తెలిపింది. ఇది భారత ఎకానమీకి ఏడాదికి రూ.19 లక్షల కోట్లు అని పేర్కొంది. మొత్తం భారత్ విద్యకు కేటాయించిన (రూ.93,000 కోట్లు) మొత్తానికి 20 రెట్లు అని పేర్కొంది.

ఉద్యోగాలు...

ఉద్యోగాలు...

ఆర్థిక వ్యవస్థలోకి డైరెక్ట్ పబ్లిక్ పెట్టుబడులు పెట్టడం ద్వారా 11 మిలియన్ల ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని ఈ నివేదిక తెలిపింది. తద్వారా 2018లో కోల్పోయిన ఉద్యోగాలకు ఊతమిచ్చినట్లవుతుందని తెలిపింది.

22 మంది కుబేరుల వద్ద ఉన్న సంపద కంటే..

22 మంది కుబేరుల వద్ద ఉన్న సంపద కంటే..

ఇక, గ్లోబల్ సర్వే ప్రకారం 22 మంది కుబేరుల వద్ద ఉన్న సంపద... ఆఫ్రికాలోని అందరు మహిళల వద్ద ఉన్న మొత్తం కంటే ఎక్కువగా ఉంది. కాగా, వివిధ డేటాల ఆధారంగా ఆక్స్‌ఫాం దీనిని విడుదల చేసింది.

English summary

Total Wealth of 63 Indian Billionaires Higher Than Union Budget, Reveals Oxfam Report

India's richest 1 percent hold more than four times the wealth held by 953 million people who make up for the bottom 70 percent of the country's population, while the total wealth of all Indian billionaires is more than the full year budget, a new study said on Monday.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more