For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

33,000 డాలర్లకు పడిపోయిన బిట్ కాయిన్, అన్ని క్రిప్టోలది అదే దారి

|

క్రిప్టో కరెన్సీ మళ్లీ పతనమవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు, ఒమిక్రాన్ కేసులు, చమురు ధరలు సహా వివిధ అంశాలు క్రిప్టో మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు ఏకంగా 33,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి ఈ డిజిటల్ కరెన్సీ రూ.33,206 వద్ద ట్రేడ్ అవుతోంది. గత 24 గంటల్లో 32,983 వద్ద కనిష్టాన్ని, 36,514 వద్ద గరిష్టాన్ని తాకింది. 3600 డాలర్ల మేర పైకి కిందకు కదలాడింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు.

ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా పతనమయ్యాయి. బిట్ కాయిన్ 6 శాతం తగ్గి 33 వేల డాలర్లకు పైన ఉండగా, ఇతర క్రిప్టోల విషయానికి వస్తే ఎథేరియం 10.89 శాతం క్షీణించి 2,194 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 0.39 శాతం క్షీణించి 0.561 డాలర్ల వద్ద, టెర్రా 0.50 శాతం క్షీణించి 60.81 డాలర్ల వద్ద, సోలానా 0.81 శాతం తగ్గి 82.24 డాలర్ల వద్ద, కార్డానో 12.84 శాతం క్షీణించి 0.970441 డాలర్ల వద్ద, స్టెల్లార్ 9.94 శాతం పడిపోయి 0.174459 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.31 తగ్గి 0.127851 డాలర్ల వద్ద, షిబా ఇను 1.43 శాతం తగ్గి 0.000019 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Top cryptocurrency prices today: Bitcoin dipped to $33,000

క్రితం సెషన్లో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక శాతం క్షీణించి 1.63 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 36 శాతం తగ్గి 83.93 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దిగ్గజ క్రిప్టో కరెన్సీల్లో దాదాపు అన్ని కూడా నేడు నష్టాల్లోనే ఉన్నాయి.

English summary

33,000 డాలర్లకు పడిపోయిన బిట్ కాయిన్, అన్ని క్రిప్టోలది అదే దారి | Top cryptocurrency prices today: Bitcoin dipped to $33,000

The crypto cart scripted a small comeback ahead of the two-day Federal Reserve meeting that begins on Tuesday.
Story first published: Monday, January 24, 2022, 20:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X