For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank FD: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 9.5 శాతం వడ్డీ.. వారికి బెస్ట్ వడ్డీనిస్తున్న టాప్- 5 బ్యాంక్స్

|

Bank FD Rates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు పథకాలను ప్రకటించటంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. దీనికి అనుగుణంగా కొత్త FD పథకాలను కూడా ప్రవేశపెట్టాయి. దీనికి తోడు రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా రెపో రేటును పెంచటం కూడా పొదుపరులకు కలిసొస్తున్న అంశంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు దిగ్గజ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

 యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం 1,001 రోజుల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం బ్యాంక్ గరిష్ఠంగా 9.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే క్రమంలో 181-201 రోజులు, 501 రోజుల డిపాజిట్లపై యూనిటీ బ్యాంక్ ఫిబ్రవరి 15, 2023 నుంచి సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 999 రోజుల కాలవ్యవధికి అత్యధికంగా 8.76 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. దీనికి తోడు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 ఏళ్ల నుంచి 999 రోజులకు ఉండే సేవింగ్స్ స్కీమ్స్ కు 8.51 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

దేశంలో అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థ అయిన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, FD ప్లస్ పథకాలను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అన్ని కాలాలకు డిపాజిట్ పథకాలపై 0.70 శాతం అదనపు రేటును సాధారణ కస్టమర్ల కంటే ఎక్కువగా చెల్లిస్తోంది. అలాగే సీనియర్లు 2-3 సంవత్సరాల కాలవ్యవధికి చేసే డిపాజిట్లపై గరిష్ఠంగా 8.80 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది.

 బంధన్ బ్యాంక్..

బంధన్ బ్యాంక్..

దేశంలోని పెట్టుబడిదారులకు బంధన్ బ్యాంక్ 3 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజన్లకు అందిస్తోంది. సాధారణ ఇన్వెస్టర్లలో పోల్చినప్పుడు సీనియర్లకు అదనంగా 0.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ క్రమంలో 600 రోజులకు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన సీనియర్లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

IDBI బ్యాంక్..

IDBI బ్యాంక్..

సీనియర్ సిటిజన్లు IDBI నమన్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల క్రింద 0.75 శాతం వరకు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద కనీస డిపాజిట్ మెుత్తం రూ. 10,000 ఉండగా.. గరిష్ఠ పరిమితి రూ.2 కోట్లకు అనుమతించబడుతోంది. సీనియర్ సిటిజన్లు 1-2 సంవత్సరాల మధ్య (444 రోజులు మరియు 700 రోజులు మినహా) మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

English summary

Bank FD: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 9.5 శాతం వడ్డీ.. వారికి బెస్ట్ వడ్డీనిస్తున్న టాప్- 5 బ్యాంక్స్ | Top 5 banks that offering best interest rates to senior citizens in india

Top 5 banks that offering best interest rates to senior citizens in india
Story first published: Sunday, February 26, 2023, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X