For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఏమవుతుంది, ఏం చేయాలి?

|

హైదరాబాద్‌కు చెందిన కిరణ్‌కు ఆరు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఒకటి డీమ్యాట్ అకౌంట్ కోసం, రెండోది హోమ్ లోన్ కోసం, మూడోది శాలరీ అకౌంట్. అలాగే ఉద్యోగం మారినప్పుడు మరో మూడు అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇలా మొత్తం ఆరు అకౌంట్లు అయ్యాయి. ఆరు అకౌంట్స్ మెయింటెయినింగ్ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఎక్కువగా ఉపయోగించని వాటిని క్లోజ్ చేయాలని చూస్తున్నాడు. ఈ ఆరు బ్యాంకుల్లో మినిమిం అమౌంట్ మెయింటెనెన్స్ కోసం రూ.25,000 నుండి రూ.30,000 మధ్య నిల్వ చేయాల్సిన పరిస్థితి. ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి, మినిమం బ్యాలెన్స్ కోసం వాటిలో నిల్వచేసే బదులు ఇన్వెస్ట్ చేయడం మంచిదని భావించాడు. దీంతో కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు చాలామందిది ఇదే పరిస్థితి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అకౌంట్స్ నిరుపయోగంగా ఉంటే మాత్రం మినిమం బ్యాలెన్స్ అందులోనే పార్క్ చేయడం వృధా.

వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే

వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే

అవసరం లేకపోయినా లేదా యాక్టివ్‌గా లేని వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించడం మంచిది కాదనేది ఆర్థిక నిపుణుల మాట. ఒకవేళ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు ప‌డ‌తాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఉండాలి. అలా ఆరు బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటే రూ.30,000 నుండి ఆ పైన ఉండాలి. బ్యాంకు ఖాతాను ఉపయోగించకుంటే క్లోజ్ చేయడం మంచిదని చెబుతారు. బ్యాంకులో కనీస నిల్వపై మూడు శాతం నుండి నాలుగు శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అంతే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా పెడితే దానికి రెట్టింపు వడ్డీ వస్తుంది. వీటితో పాటు సేవింగ్స్ ఖాతాలపై ఇతర ఛార్జీలు, డెబిట్ కార్డు ఛార్జీ వంటివి వర్తిస్తాయి. రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ట్రాన్సాక్షన్స్ లేకుంటే డీయాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఖాతా నుండి డెబిట్ కార్డు, చెక్కులు, ఆన్ లైన్, మొబైల్ ట్రాన్సాక్షన్స్ జరపడానికి వీలుండదు. ఖాతా యాక్టివేషన్ కోసం రాతపూర్వకంగా ఇవ్వాలి. బ్యాంకులోని డబ్బుతో ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఐటీ రిటర్న్స్ సమయంలో ఖాతా వివరాలు ఇవ్వాలి. మరో ఇబ్బందికర అంశం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం అన్ని పాస్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి.

మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు వద్దంటే

మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు వద్దంటే

- మినిమం బ్యాలెన్స్ కోసం అందులో డబ్బు లాక్ అవుతుంది.

- మినిమం బ్యాలెన్స్ నాన్-మెయింటెన్స్ పైన పెనాల్టీ ఉంటుంది.

- సేవింగ్స్ ఇంటరెస్ట్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇంటరెస్ట్ రేటు ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి.

- ట్రాన్సాక్షన్స్ కాస్త కష్టంగా మారుతుంది. అన్ని పాస్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి.

- మల్టిపుల్ కార్డ్స్, చెక్కు బుక్స్‌తో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడవచ్చు.

ఏం చేయాలి?

ఏం చేయాలి?

ఖాతాలు తక్కువగా ఉంటేనే మంచిది. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారవచ్చు. పెట్టుబడుల కోసం పర్మినెంట్ అకౌంట్‌ను ఉపయోగించాలి. కొత్త ఖాతా తెరిచినప్పుడు అవసరం లేని ఖాతాగా ఏదైనా అనిపిస్తే క్లోజ్ చేయాలి. వీలైతే ఉద్యోగం మారినా శాశ్వత ఖాతాను శాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఒక ఈపీఎప్ అకౌంట్‌కు ఒక UAN ఉంటుంది. ఉద్యోగం మారినా అదే UANతో ఖాతాలోని మొత్తాన్ని ఇతర సంస్థకు బదలీ చేస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటి పెట్టుబడులకు ఒకే ఖాతాను ఉపయోగించాలి. వేర్వేరు బ్యాంకులతో అనుసంధానం చేస్తే గందరగోళం అవుతుంది. పర్మినెంట్ అకౌంట్‌ను అన్నింటికి అనుసంధానం చేసుకోవాలి. ఉద్యోగం మారినప్పుడు కొత్త ఖాతాకు నగదు ట్రాన్సుఫర్ చేసుకొని, క్లోజ్ చేయాలి.

English summary

ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఏమవుతుంది, ఏం చేయాలి? | Too many bank accounts can harm your money

Maintaining minimum balance and tracking all bank accounts can be cumbersome.
Story first published: Friday, November 5, 2021, 20:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X