For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: అదానీకి మద్దతుగా ఆస్ట్రేలియా మాజీ ప్రధాని..

|

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదికపై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ స్పందించారు. ఈ నివేదికను తోసిపుచ్చారు. రెగ్యులేటర్లు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, తనకు సంబంధించినంత వరకు, "ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు" అని ఆయన అన్నారు.

"ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం కాదు. సాధారణ న్యాయ సూత్రాల ప్రకారం నేరం రుజువయ్యే వరకు అదానీ నిర్దోషిగా ఉంటారు" అబాట్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదానీ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు, సంపదను సృష్టించినందుకు అదానీ గ్రూప్‌కు ధన్యావాదాలు తెలిపారు.

అదానీ ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా దిగుమతి చేసుకున్న ఆస్ట్రేలియన్ బొగ్గు సహాయంతో భారతదేశంలోని మిలియన్ల మందికి 24x7 విద్యుత్తును అందించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు.

Tony Abbott dismisses report published by US short seller Hindenburg Research on Adani Group

" సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లో అదానీ మైనింగ్‌కు చాలా మద్దతు ఇచ్చిన వ్యక్తిగా, దేశంలోని విద్యుదీకరణకు సహాయం చేయడానికి అదానీ బొగ్గు ఇప్పుడు భారతదేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.

గత ఏడాది చివర్లో మా ప్రభుత్వం ఖరారు చేసిన ఆ ఒప్పందం ఫలితంగా అదానీ మైనింగ్ నుండి ఆస్ట్రేలియన్ బొగ్గు అందించడానికి సహాయం చేస్తోందన్నారు. "సున్నా సుంకాలతో అదానీ బొగ్గు భారతదేశానికి వస్తోంది. ఆస్ట్రేలియన్ బొగ్గుపై సుంకాలను తొలగించిన ఆ ఒప్పందానికి ధన్యవాదాలు" అని అని అన్నారు. "ఆస్ట్రేలియన్‌గా అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, వారు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు,సంపదను సృష్టించారని నాకు తెలుసు. ఆస్ట్రేలియాలో అదానీ మరియు అతని బృందం పట్టుదల చూపిన విధానాన్ని నేను మెచ్చుకుంటున్నాను" అని మిస్టర్ అబాట్ చెప్పారు.

English summary

Adani: అదానీకి మద్దతుగా ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.. | Tony Abbott dismisses report published by US short seller Hindenburg Research on Adani Group

Former Prime Minister of Australia Tony Abbott responded to the report published by American short seller Hindenburg Research on Adani Group. The report was dismissed.
Story first published: Sunday, March 5, 2023, 13:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X