For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల్లో టొమాటో ధర డబుల్: రూ.10 నుండి రూ.60కి, మరెంత కాలం?

|

కూరగాయల్లో ఈజీగా గుర్తుకు వచ్చే పేరు టొమాటో. ఇది ఎక్కువగా సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ధరలు మండిపోతాయి. కిలో టమాటో రూ.1 అంతకంటే తక్కువ పలికిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కిలో టొమాటో రూ.70 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా టొమాటో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో టొమాటో ధర హఠాత్తుగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ టొమాటో రూ.40 వరకు పలుకుతుండగా, మెట్రో నగరాల్లో రూ.60 నుండి రూ.70, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో కిలో టొమాటో రూ.72 వరకు ఉంది. టొమాటో ఎక్కువగా పండే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నది.

రెండింతలు పెరిగిన టొమాటో ధర

రెండింతలు పెరిగిన టొమాటో ధర

మెట్రో నగరాల్లో కలకత్తాలో టొమాటో ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ కిచెన్ వెజిటేబుల్ కిలో రూ.72కు పైన ఉంది. నెల రోజుల క్రితం ఇదే సమయంలో ఇదే నగరంలో టొమాటో ధర రూ.40 కంటే తక్కువగా ఉంది. అంటే ఈ నెల రోజుల కాలంలో రూ.30 కంటే పైగా పెరిగింది. ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో కిలో టొమాటో రూ.30 నుండి రెండింతలు పెరిగి రూ.60కి చేరువైంది. చెన్నైలో నెల రోజుల క్రితం రూ.20గా ఉన్న టొమాటో ఇప్పుడు రూ.60 వద్ద ఉంది. ముంబై రిటైల్ మార్కెట్లో కిలో టొమాటో రూ.50కి పైగా ఉంది. నెల రోజల క్రితం ఇదే సమయంలో కిలో రూ.15 మాత్రమే. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం రూ.10 నుండి రూ.15 ఉన్న కిలో టొమాటో ఇప్పుడు రూ.50 వద్ద ఉంది. అకాల వర్షాల వల్ల టొమాటోను ఎక్కువగా పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఈ పంట నష్టపోయిందని అజాద్‌పూర్ టొమాటో అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కౌషిక్ అన్నారు. ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీ ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల, పండ్ల మార్కెట్.

 సిమ్లా వంటి

సిమ్లా వంటి

సిమ్లా వంటి ప‌ర్వ‌త ప్రాంతాల్లో కూడా టొమాటో పంట దెబ్బ తిన్న‌ది. అకాల వ‌ర్షాల‌తో దాదాపు అరవై శాతం పంట దెబ్బ తిన్న‌ట్లుగా తెలుస్తోంది. ఫ‌లితంగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి రోజుకు 250-300 ట‌న్నుల వరకు టొమాటోలు రావాల్సి ఉండగా, అందులో సగం మాత్రమే వస్తున్నాయట. దీంతో కిలో టొమాటో ధ‌ర రెట్టింపై రూ.40 - రూ.60 మ‌ధ్య పలుకుతోంది. టొమాటో అధికంగా మధ్యప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో త్వరలో పంట చేతికి రానుంది. మరో రెండు నెలల్లో కొత్త పంట చేతికి రానుంది. అప్పటి వరకు ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

టొమాటో దిగుమతిదారు..

టొమాటో దిగుమతిదారు..

ప్రపంచంలోనే అత్యధిక టొమాటో దిగుమతిదారు భారత్. అంతేకాదు, నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ప్రకారం ఇక్కడ 7.89 హెక్టర్ల పరిధిలో దాదాపు 19.75 మిలియన్ టన్నుల టొమాటోలు పండుతున్నాయి. సగటున హెక్టారుకు 25.05 టన్నుల టొమాటోల దిగుబడి వస్తుంది.

English summary

నెల రోజుల్లో టొమాటో ధర డబుల్: రూ.10 నుండి రూ.60కి, మరెంత కాలం? | Tomato turns costly on tight supply, Prices shoot up from Rs 10 to Rs 60

Tomato prices in retail markets of metro cities have shot up to Rs 72 per kilogram on tight supply due to unseasonal rains in key producing states like Madhya Pradesh and Maharashtra.
Story first published: Thursday, October 14, 2021, 21:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X