ఆధార్-పాన్‌ను ఈ గడువులోగా లింక్ చేసుకోని, ట్రబుల్స్‌కు దూరం జరగండి
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇన్వెస్టర్లకు ఆధార్ నెంబర్‌ను పాన్ నెంబర్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్-PAN)తో లింక్ చేయాలని, ఈ పనిని సెప్టెంబర్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని మరోసారి గుర్తు చేసింది. ఇబ్బందులు లేని ట్రాన్సాక్షన్స్ కొనసాగాలంటే ఈ నెల పూర్తయ్యేసరికి లింకింగ్ పూర్తి చేసుకోవాలని సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ప్రకారం పాన్ కార్డు - ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే ఆ పాన్ నెంబర్ సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత ఇన్-ఆపరేటివ్ అవుతుంది. సెక్యూరిటీ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు పాన్ కార్డు ఏకైక గుర్తింపు. కాబట్టి గడువులోగా లింక్ చేయకుంటే సమస్య అయి కూర్చుంటుంది.
సెప్టెంబర్ 30, 2021వ తేదీ తర్వాత కొత్త ఖాతాలు తెరిచే సమయంలో సీబీడీటీ ఆదేశాలు పాటించేలా చూడాలని, ఖాతాదారుల నుండి ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన ఆపరేటివ్ పాన్ కార్డును మాత్రమే స్వీకరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ.. తన వద్ద ఉన్న అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 'ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకు సూచన ఏమంటే, సెప్టెంబర్ 30, 2021వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. మృదువైన ట్రాన్సాక్షన్స్ కోసం, అలాగే, లింక్ చేయకుండా తదుపరి సమస్యలకు దూరంగా ఉండాలి' అని సూచించింది.
ఆదాయపు చట్టం 1961 సెక్షన్ 139AA ప్రకారం పాన్ నెంబర్ కలిగి ఉన్న, అలాగే ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తులు తమ ఈ రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడం అవసరం. అయితే అసోం, జమ్ము, కాశ్మీర్, మేఘాలయలలో నివసించే వారు, అలాగే ఆదాయపు పన్ను చట్టం నాన్ రెసిడెంట్స్, సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు దాటిన వారు), ఫారెన్ సిటిజన్స్‌కు మాత్రమే మినహాయింపు ఉంది.

పాన్-ఆధార్ లింకింగ్ ఇలా...
- ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
https://www.incometax.gov.in/iec/foportal
- ఇప్పటికే రిజిస్టర్ కాకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీ.
- యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగ్-ఇన్ కావాలి.
- పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. పాన్-లింక్ ఆధార్ చేసుకోమని చెబుతుంది. లేదంటే మెనూ బార్‌లోని ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్లి, లింక్ ఆధార్ కార్డు పైన క్లిక్ చేయాలి.
- పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు పాన్ డిటైల్స్ ఆధారంగా ఉండాలి.
- మీ ఆధార్‌లో పేర్కొన్న వాటితో పాన్ వివరాలను స్క్రీన్ పైన ధృవీకరించాలి. ఒకవేళ మిస్-మ్యాచ్ అయితే మరొక దానితో సరిపోయేలా డాక్యుమెంట్‌లో అప్ డేట్ చేయాలి.
- డిటైల్స్ ఒకేలా ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, లింక్ నౌ బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆదార్-పాన్ లింకింగ్ సక్సెస్ అని పాప్-అప్ సందేశం వస్తుంది.