For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: మూడు రోజుల్లో రూ.9.03 లక్షల కోట్లు పెరిగిన సంపద..

|

గత వారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాలను ఆర్జించాయి. అయితే సోమ, మంగళ కాస్త తడపడ్డా..బుధ, గురు శుక్రవారాల్లో లాభాలను గడించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,హెచ్‌డీఎఫ్‌సీ రాణించడంతో స్టాక్ మార్కెట్లు పైకి ఎగబాకాయి.పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటం, అమెరికా ఫెడ్ అనూహ్య నిర్ణయాలు తీసుకోకపోవడం భారతీయ మార్కెట్లకు కలిసొచ్చాయి.

రూ.266.58 లక్షల కోట్లు

రూ.266.58 లక్షల కోట్లు

శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 45 పైసలు బలపడి 79.24 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.92 శాతం పెరిగి 109.2 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజులుగా సూచీలు దూసుకెళ్లడంతో పెట్టుబడిదారుల సంపద భారీగా పెరిగింది. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.9.03 లక్షల కోట్లు పెరిగి రూ.266.58 లక్షల కోట్లకు చేరుకుంది.

రాణించిన కంపెనీలు..

రాణించిన కంపెనీలు..

శుక్రవారం రిలయన్స్‌ 2.10%, టాటా స్టీల్‌ 7.27%, సన్‌ఫార్మా 5.45%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.12%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.64%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.51%, ఇన్ఫోసిస్‌ 2.12%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.87%, విప్రో 1.85%, హెచ్‌డీఎఫ్‌సీ 1.85% చొప్పున పెరిగాయి. అయితే ఫార్మా స్టాక్ ల్లో ఒత్తిడి కనిపించింది.

తగ్గిన విదేశీ మారకం..

తగ్గిన విదేశీ మారకం..

మరో వైపు జులై 22తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు 1.152 బిలియన్‌ డాలర్లు తగ్గి 571.56 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ పేర్కొంది. గత మూడు సెషన్లలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్ ల్లో కంటే లార్జ్ క్యాప్ స్టాక్ లు పెరిగాయి. వచ్చే వారం మార్కెట్లు త్రైమాసిక ఫలితాలు, గ్లోబల్ సూచీల ఆధారంగా కదలికలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

Stock Market: మూడు రోజుల్లో రూ.9.03 లక్షల కోట్లు పెరిగిన సంపద.. | title: Stock markets ended last week with huge gains

Stock markets have closed in gains for the past three sessions. Due to this, the wealth of the investors increased enormously.
Story first published: Saturday, July 30, 2022, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X