స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ.. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) షేర్లు గురువారం ట్రేడింగ్ లో భారీగా పుంజుకున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ఈ షేరు విలువ దాదాపు 40 శాతం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అసలు ఇదెలా సాధ్యమైంది? ఇప్పుడు చూద్దాం.
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడం రెస్టారెంట్లు మూత పడడం వంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం కారణంగా స్టాక్ మార్కెట్లో గ్యాస్ కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అదానీ టోటల్ గ్యాస్ షేరు గురువారం బాగా పుంజుకుంది.

ప్రభుత్వ 'గ్యాస్ సప్లై ఆర్డర్ 2026' ప్రభావం
మార్చి 9 న భారత ప్రభుత్వం 'నేచురల్ గ్యాస్ (సప్లై రెగ్యులేషన్) ఆర్డర్, 2026'ను జారీ చేసింది. దీని ప్రకారం, యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడితే.. గృహ అవసరాలకు వాడే పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) , రవాణా రంగానికి వాడే కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (CNG) కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హార్ముజ్ జలసంధి గుండా ఎల్‌ఎన్‌జీ (LNG) రవాణా నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదానీ టోటల్ గ్యాస్ ప్రధానంగా సీఎన్‌జీ , పీఎన్‌జీ సరఫరాలో ఉండటంతో ఈ కొత్త నిబంధన కంపెనీకి పెద్ద ఊరటనిచ్చింది.
2 రోజుల్లో 39 శాతం ర్యాలీ
గురువారం బీఎస్ఈ (BSE) లో అదానీ టోటల్ గ్యాస్ షేరు 14.2 శాతం పెరిగి రూ.650 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గత రెండు సెషన్లలో కలిపి ఈ షేరు దాదాపు 39 శాతం లాభపడింది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ.. ఈ కంపెనీ షేర్లు మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆర్డర్ వల్ల సామాన్య ప్రజలకు, రవాణా రంగానికి గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
పారిశ్రామిక వినియోగదారులపై ప్రభావం
మరోవైపు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల కొన్ని సరఫరా సంస్థలు గ్యాస్ కోత విధించాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పారిశ్రామిక వినియోగదారులకు (Industrial Customers) సరఫరా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ ప్రభావాన్ని అంచనా వేస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. గెయిల్ (GAIL) , పెట్రోలియం ప్లానింగ్ సెల్ ద్వారా గ్యాస్ కేటాయింపులను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
పెరిగిన ధరలు
సరఫరా అడ్డంకుల వల్ల దేశీయ మార్కెట్ లో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. వంట గ్యాస్ ధర సిలిండర్ కు రూ.60, వాణిజ్య ఎల్‌పీజీ ధర రూ.114.5 చొప్పున పెరిగింది. యూరప్ లో కూడా సహజ వాయువు ధరలు గత వారం 40 శాతం పెరిగాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అదానీ టోటల్ గ్యాస్ వంటి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications