For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: హోమ్‌లోన్ స్కీం ఏడాది పొడిగింపు, రూ.3.5 లక్షలు ఆదా

|

ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్‍‌లో శుభవార్త తెలిపింది. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ప్రయోజకరం. అఫొర్డబుల్ హోమ్ లోన్ పథకాన్ని మార్చి 31, 2021 వరకు పొడిగిస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2019 జూలైలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచారు.

ఆదాయపు పన్ను గురించిన మరిన్ని కథనాలు

మరో ఏడాది పాటు స్కీం పొడిగింపు

మరో ఏడాది పాటు స్కీం పొడిగింపు

గత బడ్జెట్‌లో గరిష్ట పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం ద్వారా ఇంటి కొనుగోదులుదారులకు ఊరట కల్పించారు. దీనిని ఈ బడ్జెట్‌లోను మరో సంవత్సరంపాటు పొడిగించారు. సాధారణంగా ఇది మార్చి 31, 2020తో ముగియాలి. రూ.45 లక్షల వ్యాల్యూ కలిగిన ఇంటి కొనుగోలుపై మొదటిసారి హోమ్ బయ్యర్స్‌కు అదనపు ప్రయోజనాలు కల్పించారు.

హోమ్ బయ్యర్స్‌కు ప్రోత్సాహమే

హోమ్ బయ్యర్స్‌కు ప్రోత్సాహమే

ఊహించిన విధంగానే బడ్జెట్‌లో సెక్షన్ 80EEA కింద వచ్చే తగ్గింపును మరో సంవత్సరం పాటు మోడీ ప్రభుత్వం పొడిగించిందని, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని, హోమ్ బయ్యర్స్‌కు ప్రోత్సాహకంగా ఉంటుందని, అదే విధంగా 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే కేంద్ర ప్రభుత్వం కలను సాకారం చేసే దిశగా ఉంటుందని పైసా బజార్ డాట్ కామ్ సీఈవో, కో ఫౌండర్ నవీన్ కుక్రేజా అన్నారు.

రూ.3.5 లక్షల వరకు ప్రయోజనం

రూ.3.5 లక్షల వరకు ప్రయోజనం

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఓ వ్యక్తి హోమ్ లోన్‌పై చల్లించే వడ్డీ మొత్తంపై తగ్గింపు పొందవచ్చు. గ్రాస్ టోటల్ ఇన్‌కం నుంచి ఈ వడ్డీ మొత్తంపై మినహాయిపు ఉంటుంది. దీంతో మొత్తంగా పన్ను భారం తగ్గుతుంది. అఫొర్డబుల్ హౌసింగ్ స్కీం కింద హోమ్ లోన్ తీసుకుంటే చెల్లించిన వడ్డీ మొత్తంపై గరిష్టంగా రూ.3.5 లక్షల వరకు ప్రయోజనం పొందగలరు

తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తే..

తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తే..

తొలిసారి ఇంటిని కొనుగోలు చేసే మధ్య తరగతి వారికి రూ.3.5 లక్షల వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. రూ.45 లక్షల లోపు వ్యాల్యూతో 2021 మార్చి 31 లోపు హోమ్ లోన్ తీసుకుంటే ఇది వర్తిస్తుంది. సెల్ఫ్ ఆక్యుఫైడ్ అయితే హోమ్ లోన్ పైన చెల్లించిన ప్రిన్సిపల్ మొత్తం వడ్డీ మొత్తంపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. హోమ్ లోన్ పైన రూ.1.5 లక్షలు, వడ్డీ మొత్తంపై రూ.2 లక్షల వరకు పన్ను తగ్గింపు ఉంటుంది.

English summary

గుడ్‌న్యూస్: హోమ్‌లోన్ స్కీం ఏడాది పొడిగింపు, రూ.3.5 లక్షలు ఆదా | Timeline to avail loan for affordable housing extended till March 31, 2021

​​As per income tax laws, an individual can claim interest paid on housing loan as a deduction from gross total income. The amount of interest which can be claimed as deduction is currently capped at Rs 3.5 lakh.
Story first published: Monday, February 3, 2020, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X