For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tim Cook: ఆపిల్ కంపెనీలో ఉద్యోగం కావాలంటే 4 క్వాలిటీస్ తప్పనిసరి.. టిమ్ కుక్ ఏమన్నారంటే..?

|

Tim Cook: చాలా మంది తమ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజ అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలని భావిస్తుంటారు. అయితే అది అనుకున్నంత సులువు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఇలాంటి కంపెనీల్లో ఆఫర్స్ పొందాలంటే ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ సీఈవో మాట..

ఆపిల్ సీఈవో మాట..

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల ఇటాలియన్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆపిల్ విజయం కంపెనీ సంస్కృతితో ముడిపడి ఉందని అన్నారు. కంపెనీ నియమించుకునే నిపుణుల గురించి కూడా మాట్లాడారు. నియామక సమయంలో నాలుగు క్వాలిటీలను గమనిస్తున్నట్లు టిమ్ కుక్ చెప్పారు.

కావలసిన క్వాలిటీలు..

కావలసిన క్వాలిటీలు..

ఆపిల్ ఉద్యోగులను నియమించుకునేటప్పుడు మెుదట సహకరించే సామర్ధ్యాన్ని గుర్తిస్తామని అన్నారు. రెండోది ఆలోచనను పంచుకున్నప్పుడు దానిని మెరుగుపరిచేందుకు ఆలోచించటాన్ని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఆ తర్వాత ఉద్యోగిలోని క్రియేటివిటీ, క్యూరియాసిటీలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

 ఆలోచన అభివృద్ధి..

ఆలోచన అభివృద్ధి..

పాత ఆలోచనలను మెరుగుపరచడానికి, కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి ఉద్యోగికి సహకారం, సృజనాత్మకత, ఉత్సుకత చాలా అవసరమైన లక్షణాలని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. చివరగా ఉద్యోగికి అవసరమైన నాలుగో లక్షణం నైపుణ్యం అని అన్నారు. సిబ్బందిలోని ఈ లక్షణాలు "ప్రతిష్టాత్మకమైన, సపోర్టివ్" వర్క్ కల్చర్ కు కీలకమన్నారు.

ఆర్ధిక మందగమనంతో..

ఆర్ధిక మందగమనంతో..

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆపిల్ కంపెనీలో ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అంతర్జాతీయ వృద్ధి మందగమనం కారణంగా ఇటీవలి కాలంలో కంపెనీ నియామకాలను తగ్గించింది. ఇతర టెక్ కంపెనీలు సైతం ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. తాజాగా ఆగస్టు నెలలో కంపెనీ చాలా మంది కాంట్రాక్ట్ ఆధారిత రిక్రూటర్‌లను తొలగించింది.

English summary

Tim Cook: ఆపిల్ కంపెనీలో ఉద్యోగం కావాలంటే 4 క్వాలిటీస్ తప్పనిసరి.. టిమ్ కుక్ ఏమన్నారంటే..? | Tim Cook reveals 4 qualities required to get a job in Apple company know details

Tim Cook reveals 4 qualities required to get a job in Apple company know details
Story first published: Tuesday, October 4, 2022, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X