భారత్‌తో సహా వివిధ దేశాల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతేకాదు, అమెరికా సహా వివిధ దేశాల్లో వాటా విక్రయానికి సిద్ధపడిందని, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్, హెలో యాప్స్ నిషేధానికి గురయ్యాయి. భద్రతా కారణాలతో పదుల సంఖ్యలో చైనీస్ యాప్స్ నిషేధానికి గురయ్యాయి. దీంతో బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలోని సంస్థల ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. పలువురు ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు వెతుక్కునే పనిలో కూడా పడ్డారట.

చర్చలు.. ఉద్యోగులను కాపాడుకునే ప్రయత్నం
భారత్‌లో ఓ వైపు నిషేధం, దీంతో మరోవైపు వాటా అమ్మకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో సందిగ్ధ పరిస్థితి ఏర్పడి, కొంతమంది ఇతర ఉద్యోగాలు వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారట. కొత్త నియామకాలను కూడా నిలిపివేసింది టిక్‌టాక్. 2016లో ప్రారంభమైన చైనాకు చెందిన టిక్‌టాక్‌కు భారత్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సెన్సార్ టవర్ డేటా ప్రకారం దేశంలో 650 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్‌కు విక్రయంపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుత చర్చల సమయంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట.

సీఈవో హామీ...
కంపెనీలో ప్రస్తుతం ఎలాంటి తొలగింపులు లేవట. పరిస్థితి అంతా సానుకూలంగానే ఉందని ఉద్యోగులకు అంతర్గత సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గాల్వాన్ ఘటన అనంతరం కొంతమంది బైట్‌డ్యాన్స్, అనుబంధ కంపెనీల్లో పని చేయడానికి ఆందోళన చెందుతున్నారట. గత నెలలో టిక్‌టాక్ సీఈవో ఉద్యోగులకు లేఖ రాశారు. ఉద్యోగులే తమ బలమని, వారి శ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇస్తామని, ఇండియాలో పని చేసే 2000 మందికి ఈ మేరకు హామీ ఇస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

నియామకాల దూకుడు!
బైట్ డ్యాన్స్ జనవరి నుండి నియామకాలు వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో ట్రాఫిక్ పెరగడంతో మరింతమందిని నియమించుకుంది. ఏప్రిల్, మే నెలల్లో జాబ్ ఆఫర్స్ ఉన్నాయని, కానీ కేంద్రం 59 యాప్స్‌ను నిషేధించిన అనంతరం హోల్డ్‌లో ఉంచినట్లు చెబుతున్నారు. కాగా ఈ యాప్స్‌ను నిషేధించిన తర్వాత టిక్ టాక్ ప్రత్యర్థి యాప్స్ చింగారీ, ట్రెల్, బోలోఇండ్యా, రోబోసో బాగా పుంజుకున్నాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications