న్యూయార్క్: ప్రపంచంలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సీఈవోల జాబితాలో టాప్ 10లో ముగ్గురు ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. హార్వార్డ్ బిజినెస్ రివ్యూ (HBR) అనే సంస్థ ప్రతి ఏటా సీఈవోల పనితీరుపై జాబితా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా 2019 సంవత్సరానికి గాను పనితీరు ఆధారంగా టాప్ 100 సీఈవోల పేర్లను ప్రకటించింది. ఇందులో అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టాప్ 10లో నిలిచారు. అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈవో జెన్‌సెన్ హువాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

జాబితాలో భారతీయులు...
HBR జాబితాలో శంతను నారాయణ్ 6వ స్థానంలో, అజయ్ బంగా 7వ స్థానంలో, సత్య నాదెళ్ల 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో డీబీఎస్ బ్యాంక్ సీఈవో పియూష్ గుప్తా 89వ స్థానంలో ఉన్నారు. 2015 నుంచి కేవలం ఆర్థికపరమైన అంశాలేగాక, పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకుల్ని ప్రకటిస్తున్నట్లు HBR తెలిపింది.

తొలి స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్
2014 నుంచి ప్రతి సంవత్సరం అత్యుత్తమ సీఈవోల్లో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి మొదటి స్థానం చేజారింది. పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో బెజోస్ స్కోర్ తక్కువగా ఉందని HBR తెలిపింది. దీంతో తొలి స్థానంలో జెన్‌సెన్ హువాంగ్ నిలిచారు. కేవలం ఆర్థిక పని తీరు ఆధారంగా మాత్రమే జెఫ్ బెజోస్ 2014 నుంచి తొలి స్థానంలో ఉన్నారు.

టాప్ 100లో టిమ్ కుక్
టాప్ 100లో ఉన్నవారిలో నైక్ సీఈవో మార్క్ పార్కర్ (20వ స్థానం), జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ జామీ డిమాన్ (23), లాక్ హీడ్ మార్టిన్ చీఫ్ మార్లిన్ హీసన్ (37), డిస్నీ సీఈవో రాబర్ట్ ఐగర్ (55), యాపిల్ సీఈవో టిమ్ కుక్ (62), సాఫ్ట్ బ్యాంకు చీఫ్ మసయోషి సన్ (96)లు ఉన్నారు.

పని చేస్తున్న మహిళలే తక్కువగా ఉన్నారు...
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన సంస్థలను పరిగణలోకి తీసుకున్నట్లు HBR తెలిపింది. అలాగే పదిహేనేళ్లుగా పని చేస్తున్న సీఈవోలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. మహిళా సీఈవోలు తక్కువగా ఉన్నారని పేర్కొంది. 2018లో ముగ్గురు మహిళలు ఈ జాబితాలో ఉండగా, ఈసారి నలుగురు ఉన్నారు. అంతకుముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అసలు పని చేస్తున్న మహిళలే తక్కువగా ఉన్నారని తెలిపింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

Infosys: ఇన్ఫోసిస్‌లో భారీ మార్పులు.. సలీల్ పరేఖ్ పదవీ కాలం పెంపు.. తదుపరి చైర్మన్ ఆయనేనా?

Jiostar: జియో సినిమాను నంబర్ వన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్నారా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications