For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Groups: అదానీ కంపెనీలకు ఏ బ్యాంకు ఎంత అప్పు ఇచ్చిందంటే..!

|

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాతా అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనమవుతూ వస్తున్నాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు, అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అదానీ గ్రూప్ కంపెనీలకు ఏ బ్యాంకు ఎంత లోన్ ఇచ్చింది ఆర్బీఐ తెలిపింది. అదానీకి లోన్లు భారీగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి.

ఎస్బీఐ

ఎస్బీఐ

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ అదానీ గ్రూప్ కంపెనీలకు రూ.27 వేల కోట్ల అప్పు ఇచ్చింది. అదానీ గ్రూప్‌కు బ్యాంక్ మొత్తం ఎక్స్పోజర్ లో 0.9 శాతం అంటే దాదాపు రూ. 27,000 కోట్ల అప్పు ఇచ్చామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. అదానీ గ్రూప్ కంపెనీలకు పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 7 వేల కోట్లు అప్పు ఇవ్వగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5,380 కోట్ల అప్పు ఇచ్చింది.

అదానీ గ్రూప్ ప్రాజెక్టులు

అదానీ గ్రూప్ ప్రాజెక్టులు

అదానీ గ్రూప్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చామని.. ప్రత్యక్షమైన ఆస్తులు అవసరమైన నగదును జనరేట్ చేస్తున్నాయని దినేష్ ఖరా తెలిపారు. దేశంలోని బ్యాంకింగ్ రంగానికి ఎలాంటి డోకా లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్‌బీఐ కూడా పేర్కొంది. ఈ బ్యాంకులే కాకుండా ఇతర బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చాయి. మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కూడా ఆదానీ గ్రూప్ ల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది.

ఎల్ఐసీ షేర్‌హోల్డర్లు

ఎల్ఐసీ షేర్‌హోల్డర్లు

ఎల్ఐసీ షేర్‌హోల్డర్లు, కస్టమర్‌లు అదానీ గ్రూప్‌కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బీమా సంస్థ మార్కెట్లో వైవిధ్యభరితమైన దీర్ఘకాలిక పెట్టుబడిదారు అని ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి రాయిటర్స్‌తో చెప్పారు.

LIC బాగా విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉందని పేర్కొన్నారు.

English summary

Adani Groups: అదానీ కంపెనీలకు ఏ బ్యాంకు ఎంత అప్పు ఇచ్చిందంటే..! | Three banks have given huge loans to Adani group companies

Adani Group's shares have been falling heavily since the Hindenburg report. Due to this, banks that have given loans to Adani group companies and those who have invested in Adani companies are getting worried.
Story first published: Saturday, February 4, 2023, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X