Home Loan: హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే తక్కువ వడ్డీకి రుణాలిచ్చే బ్యాంకులివే..
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లను పెంచింది. ఆర్భీఐ నిర్ణయంతో బ్యాంకులు అన్ని హోం లోన్లపై వడ్డీ రేట్లు పెంచాయి. కొన్ని బ్యాంకులు అయితే నెలలో రెండేసి సార్లు వడ్డీ రేట్లు పెంచాయి. దీంతో హోం లోన్ తీసుకున్నవారి ఈఎంఐ పెరిగిపోయింది. కొత్తగా తీసుకునే వారు కూడా కొచ్చెం ఆలోచిస్తున్నారు. అయితే తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు కూడా ఉన్నాయి. ఏఏ బ్యాంకులు తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇస్తున్నాయో చూద్దాం..

పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోం లోన్ పై వడ్డీ రేటును 6.80- 8.05 శాతం మధ్య, RLLR 7.50 శాతంతో అందిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
గృహ రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.90 నుంచి 8.60 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. RLLR 7.25 శాతంగా ఉంది.

యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్ బ్యాంక్ హోం లోన్లపై 7 నుంచి 7.3 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్ RLLR 7 శాతంగా ఉంది.

కెనరా బ్యాంకు
కెనరా బ్యాంక్ వడ్డీ రేటును 7.05 నుంచి 9.25 శాతంగా ఉంది. RLLR 7.30 శాతంతో అందిస్తుంది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గృహ రుణాలపై 7.05 శాతం నుంచి 7.30 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. RLLR 6.85 శాతంగా ఉంది.