For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే పథకం... వచ్చే నెలలో క్లోజ్ అవుతోంది. చేరారా లేదా?

|

ప్రభుత్వ ఉద్యోగులను పక్కకు పెడితే... ప్రైవేటు రంగంలోని వారికి పెన్షన్ అనేది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే, ఏ ఒక్క కంపెనీ కూడా ఉద్యోగులకు సరైన పెన్షన్ స్కీమ్స్ అందించే ఏర్పాట్లు చేయటం లేదు. రిటైర్ ఐన తర్వాత పెన్షన్ రావాలంటే వయసులో ఉన్నప్పుడే జాగ్రత్తగా పలు పెన్షన్ పథకాల్లో చేరితే ఫరవా లేదు.

iQOO సరికొత్త 5G మొబైల్, IPL టార్గెట్

వీరు చేరవచ్చు..

వీరు చేరవచ్చు..

కానీ అప్పుడు చేయలేకపోయిన వారు, 60 ఏళ్ళు దాటిన వారు కూడా జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి ) సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకంలో చేరవచ్చు. ఇందుకు గడువు మార్చి 31, 2020 వరకు మాత్రమే ఉంది. దీని పేరే 'ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై)'. ఇందులో చేరితే నెలకు రూ 1,000 నుంచి గరిష్టంగా రూ 10,000 పెన్షన్ లభిస్తుంది. అది కూడా పదేళ్ల వరకు పెన్షన్ వస్తుంది. పథకంలో చేరిన వెంటనే పెన్షన్ కూడా మొదలవుతుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల పై వచ్చే వడ్డీ రేట్లు నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో ఈ పథకంలో అధిక రాబడికి కచ్చితమైన హామీ ఉండటం విశేషం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.

పథకం విశేషాలు....

పథకం విశేషాలు....

-ఈ పథకంలో చేరేందుకు కనీస వయసు 60 ఏళ్ళు. గరిష్ట వయసు పరిమితి లేదు.

-పాలసీ టర్మ్ 10 ఏళ్ళు ఉంటుంది.

-కనీస పెన్షన్ మొత్తం నెలకు రూ 1,000. గరిష్టంగా ఇది రూ నెలకు రూ 10,000 వరకు ఉంటుంది.

-పాలసీదారునికి పెన్షన్ ను నెఫ్ట్ ద్వారా చెల్లిస్తారు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందే ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చు.

-ఈ పథకంలో చేరేందుకు వృద్ధులు ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే లాంసుమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

-గరిష్టంగా పాలసీ పర్చేజ్ ప్రైస్ రూ 14,45,783 ఉంటుంది.

-ఇందులో చేరేందుకు ఆన్లైన్, ఆఫ్ లైన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లో అయితే స్వయంగా మీరే ఎల్ ఐ సి అధికారిక వెబ్సైటు లోకి లాగిన్ అవటం ద్వారా చేరవచ్చు. లేదంటే ఎల్ ఐ సి ఏజెంట్ సహకారంతో కూడా దీనిని తసుకోవచ్చు.

మెచూరిటీ బెనిఫిట్

మెచూరిటీ బెనిఫిట్

-మెచూరిటీ బెనిఫిట్ కింద పాలసీ యాన్యుటీ పర్చేజ్ ప్రైస్ తో పాటు, చివరి పెన్షన్ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి చెల్లిస్తారు.

-ఒకవేళ పోలీసైదారుడు పాలసీ టర్మ్ పూర్తి కాకముందే మరణిస్తే.. యాన్యుటీ స్కీం పర్చేజ్ ప్రైస్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.

-ఈ పాలసీ పై ఋణం పొందే అవకాశం కూడా ఉంది. పాలసీ చేసిన మూడేళ్ళ తర్వాత మొత్తం సొమ్ములో 75% రుణంగా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

-అలా ఋణం తీసుకుంటే గనక, పాలసీ దారుకు చెల్లించే పెన్షన్ లో నుంచి వడ్డీ ని మినహాయించుకుని చెల్లిస్తారు. చివరికి చెల్లించే మొత్తం నుంచి రుణ లో ప్రిన్సిపాల్ ను మినహాయించుకుంటారు.

-ఏదైనా బలమైన కారణాల వల్ల ఈ పథకం నుంచి బయటకు రావాలంటే .. కొన్ని సందర్భాల్లో అవకాశం కల్పిస్తారు. పాలసీదారుడు లేదా అతని జీవిత భాగస్వామికి తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు పాలసీ ని సరెండర్ చేసి, పథకం నుంచి బయటకు రావొచ్చు.

-ఇలాంటి సందర్భంలో పాలసీ పర్చేజ్ ప్రైస్ లో 98% సొమ్మును తిరిగి చెల్లిస్తారు.

-ఈ పథకంలో మదుపు చేసిన సొమ్ముకు ఆదాయపన్ను చట్టం లోని 80 సి లో మినహాయింపులు రావు.

Read more about: pmvvy lic
English summary

This LIC pension scheme that can provide Rs 10,000 a month will end March 31

Pradhan Mantri Vaya Vandana Yojana (PMVVY) pension scheme, meant for senior citizens, is available only till March 31, 2020. This immediate annuity LIC pension scheme can provide them with a steady income after retirement. Citizens above 60 years of age can invest in this scheme which offers a guaranteed monthly income of up to Rs 10,000 for 10 years. Apart from this, it also offers a death benefit in the form of the return of purchase price of the scheme to the nominee.
Story first published: Saturday, February 22, 2020, 9:35 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more